Friday, March 29, 2024
- Advertisement -

బిగ్ బాస్ హింట్ : బిగ్ బాస్ విన్నర్ బాబా మాస్టారే.. ?

- Advertisement -

బిగ్ బాస్ పై మొదట్లో చప్పగా నడిచినప్పటికి.. ఇప్పుడు మాత్రం మంచి జోరుగా సాగుతోంది. అయితే ఇటీవలే ఈ షోలో వివాదలు ఎక్కువయ్యాయి. శ్రీముఖి, రాహుల్ మధ్య గొడవలు హైలెట్ అయ్యాయి. ఇక రాహుల్, పునర్నవి మధ్య రొమాన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. పునర్నవి బయటకు వచ్చిన రోజు రాహుల్ తెగ ఏడ్చాడు కూడా. పునర్నవి బయట కూడా రాహుల్ కు సపోర్ట్ చేస్తూ ప్రచారం చేస్తుంది. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు ఉన్నారు.

అందరు నామినేట్ లో ఉన్నారు. ఇక సభ్యుల బంధువులను ఇటీవలే ఇంటిలోకి పంపుతున్నాడు బిగ్ బాస్. వితికా చెల్లి – అలీ భార్య – శివజ్యోతి భర్త – బాబా భాస్కర్ భార్య – పిల్లలు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక తాజాగా వరుణ్ బామ్మ, రాహుల్ తల్లి, శ్రీముఖి తల్లి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వరుణ్ బామ్మ ఇంటిలోకి అడుగుపెట్టి అందర్ని ఎంటర్ టైన్ చేసింది. సరదాగా మాట్లాడుతూ బిగ్ బాస్ నే ఆడుకుంది. బాబా భాస్కర్ అందరికి వంట బాగా చేసి పెడతాడని చెప్పింది. బాబా ఇన్ని రోజులు వంట చేయడం చాలా గ్రేట్ అని చెప్పింది.

అయితే బిగ్ బాస్ చేయిస్తున్న ఇవన్నీ చూస్తే మనకు కొన్ని హింట్స్ మైండ్ కు తగులుతున్నాయి. అవేంటంటే.. బిగ్ బాస్ మొదటి సీజన్ లో హీరో శివ బాలజీ టైటిల్ విన్నర్ అయ్యాడు. అయితే సీజన్ వన్ లో శివ బాలజీ ఎక్కువగా వంట గదిలోనే ఉండేవాడు. ఇప్పుడు సీజన్ 3లో కూడా బాబా మాస్టర్ వంట గదిలోనే ఉంటూ అందర్ని అలరిస్తున్నాడు. ఇక బిగ్ బాస్ రెండో సీజన్ లో కేవలం కౌశల్ పిల్లలను, భార్యను మాత్రమే హౌస్ లోకి పంపించాడు బిగ్ బాస్. అలానే సీజన్ 3లో కూడా కేవలం బాబా మాస్టర్ పిల్లలను, భార్యను మాత్రమే పంపించారు.

సీజన్ రెండు, మూడులో పిల్లలు కామన్.. అప్పుడు కౌశల్ విన్నర్ గా నిలిచాడు. సీజన్ వన్ లో శివ బాలాజీ ఎక్కువగా వంటగదిలో ఉండేవాడు.. ఇప్పుడు సీజన్ 3లో బాబా మాస్టర్ కూడా అదే చేస్తున్నాడు. ఇక్కడ వంట అనేది కామన్. అప్పుడు శివ బాలాజీ విన్నార్ అయ్యాడు. వీటన్నిటిని బట్టి చూస్తే బాబా మాస్టర్ సీజన్ 3కి విన్నర్ అనే సూచనలు బిగ్ బాస్ మనకు ఇస్తున్నట్లు అర్దం అవుతుంది. మరి మీకు విన్నర్ ఎవరు అనిపిస్తున్నారో ఓ కామెంట్ ద్వారా తెలపండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -