Friday, March 29, 2024
- Advertisement -

బిగ్ బాస్ 3 విన్నర్ బాబా భాస్కర్.. ఎందుకంటే ?

- Advertisement -

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 మరో వారం రోజుల్లో ముగియనుంది. రాహుల్ టాస్క్ లో గెలిచి డైరెక్ట్ గా టికెట్ టు ఫినాలేకి వెళ్లాడు. ఆ క్రమంలో అంటే మిగిలిన ఐదుగురు నామినేషలో పడిపోయారు. ఇందులో ఒకరు ఎలిమినేట్ అవుతే మిగిలిన నలుగురు రాహుల్ తో కలిసి ఫైనల్ వీక్ లో పోటీ పడుతారు. ఎలిమినేషన్ కు నామినేట్ అయిన వారు నాగార్జున వచ్చినప్పుడు ఎలిమినేట్ అయి బయటకు వస్తారు లేదా సేవ్ అవుతారు.

కానీ ఇటివలే ఎపిసోడ్ లో బిగ్ బాస్ అప్పుడే ఒకర్ని సేవ్ చేశాడు. రాహుల్ తప్పిస్తే ఇంట్లో ఉన్న శ్రీముఖి, శివజ్యోతి, వరుణ్‌, బాబాబాస్కర్‌, అలీ నామినేట్ అయ్యి ఉన్నారు. వీరిలో శివజ్యోతి పక్కాగా ఎలిమినేట్ అవుతుందని అందరు అంటున్నారు. ఈ క్రమంలో శ్రీముఖికి అత్యధికంగా ఓట్లు వచ్చి సేవ్ అవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఎవరు ఊహించని ట్విస్ట్ ఏంటంటే బాబా భాస్కర్ మొదట సేవ్ అయ్యాడు.

రాహుల్ తర్వాత బాబా భాస్కరే టికెట్ టు ఫినాలేను దక్కించుకున్నాడు. ఇక నామినేట్ లో ఉన్న శ్రీముఖి, శివ జ్యోతి, వరుణ్‌, అలీల్లో ఒకరు సేవ్ అవ్వనుండగా.. నాగార్జున వచ్చిన రోజు ఎలిమినేషన్ ఉంటుంది. ఇది పక్కన పెడితే ఫైనల్ విన్నర్ విషయంలో చాలా చర్చలు జరుగుతున్నాయి. నిజానికి రాహుల్ మరియు శ్రీముఖి మధ్య గట్టి పోటీ ఉంటుందని అందరు అనుకున్నారు.

కానీ శ్రీముఖి కంటే ఎక్కువ ఓట్లు బాబా మాస్టర్ కు రావడం ఆశ్చర్యంగా అనిపించింది. రాహుల్ మరియు బాబా భాస్కర్ పోటీ పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ వారం బాబా భాస్కర్ మంచి ప్రదర్శణ కనబరిస్తే రాహుల్ కంటే ఎక్కువ ఓట్లు బాబా భాస్కర్ కు పడే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంటున్నారు. రాహుల్ కంటే బాబానే ఎక్కువ యాక్టివ్ గా ఉంటాడు. అందుకే బాబాకు టైటిల్ దక్కే ఛాన్స్ ఎక్కువగా ఉందని అందరు అంటున్నారు. మరి దీనిపై మీరు ఏం అంటారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -