Tuesday, April 16, 2024
- Advertisement -

బిగ్ బాస్ 3 విన్నర్ శ్రీముఖి కాదు.. ఎవరంటే ?

- Advertisement -

తెలుగు బిగ్ బాస్ మూడో సీజన్ తుది దశకు చేరుకుంది. ఇంకో రెండు రోజుల్లో విన్నర్ ఎవరో అందరికి తెలిసిపోతుంది. ప్రస్తుతం హౌస్ లో రాహుల్, వరుణ్, శ్రీముఖి, బాబా భాస్కర్, అలీ ఉన్నారు. వీరులో విజేత ఎవరు అవుతారు అనే ఉత్కంఠత.. రోజు రోజుకి పెరుగుతోంది. ఇంట్లో ఉన్న ఐదుగురు సభ్యులకు వారి ఫ్యాన్స్ గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ రెండులో కౌశల్ కు భారీ క్రేజ్ ఉండేది.

అప్పుడు దాదాపుగా ఫైనల్ కు రాకముందే కౌశల్ విన్నర్ అని తెలిసిపోయింది. ఎందుకంటే అప్పుడు అతనికి ఆ రెంజ్ లో క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు ఉన్నవారిలో రాహుల్, శ్రీముఖి మధ్య పోటీ నడుస్తోంది. సో ఇద్దరిలో ఎవరు విన్ అవుతారు అనేది చెప్పడం కష్టం. అయితే ఇటివలే సోషల్ మీడియాలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ శ్రీముఖి అంటూ ఓ ఫోటో బాగా వైరల్ అయింది. ఇంకా ఓటింగే కంప్లీట్ కాలేదు అప్పుడే శ్రీముఖి విన్నర్ కావడం ఏంటని చాలా మంది కంగారు పడిపోయారు.

అయితే అసలు విషయం ఏంటంటే.. ఆ ఫోటో ఫేక్ ఫోటో. సల్మాన్ ఖాన్ హిందీ బిగ్ బాస్ కు సంబంధించిన ఫోటోని తీసుకుని మనవాళ్లు వారి మొహాల ప్లేస్ లో నాగార్జున, శ్రీముఖి మొహాలను తగిలించి కంగారు పెట్టారు. దాంతో శ్రీముఖి విన్నర్ అయిందని అనుకున్నారు. కానీ ఫైనల్ ఎపిసోడ్ కు సంబంధించి షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఫైనల్ విన్నర్ ఎవరు అనేది ఇంకా తెలిసే ఛాన్స్ లేదు. దాదాపుగా రాహులే విన్నర్ కావొచ్చు అని అంచనా మాత్రం నెటిజన్లు వేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -