Thursday, April 18, 2024
- Advertisement -

గంగవ్వ కోసం బిగ్ బాస్ ఎన్ని లక్షలతో ఇల్లు కట్టిస్తున్నారంటే ?

- Advertisement -

గంగవ్వ ఉన్న అయిదు వారాలు షో చాలా ఆసక్తికరంగా సాగింది. రేటింగ్ కూడా చాలా బాగా వచ్చింది. హౌస్ లో గంగవ్వకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానెల్ తో ఫేమస్ అయిన గంగవ్వ తనకు ఇల్లు లేదు. డబ్బులు వస్తాయనే ఉద్దేశ్యంతో బిగ్ బాస్ కు వచ్చానంటూ చెప్పింది గంగవ్వ.

ఆ డబ్బుతో ఇల్లు కట్టుకుంటాను అని చెప్పింది. గంగవ్వ ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆమెను బయటకు పంపించారు బిగ్ బాస్. గంగవ్వ వెళ్లే ముందు నాగార్జున స్వయంగా ఇల్లు కట్టిస్తానంటూ ప్రామీస్ చేశారు. నాగ్ స్టేజ్ పై చేసిన ప్రామీస్ ను నిలబెట్టుకుంటారా అనేది అందరికి అనుమానంగా ఉండేది. కాని నాగార్జున చెప్పినట్లుగా బిగ్ బాస్ టీం ఆమె పారితోషికం ఇవ్వడంతో పాటు ఆమెకు ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు సిద్దం అయ్యారు. ఆమె ఇంటికి కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇప్పటికే ఆమె ఇంటి కోసం ప్లాన్ రెడీ అయిందట. ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ వరకు గంగవ్వ కోసం ఇల్లు రెడీ అవుతుందట. దాదాపు 15 లక్షలతో గంగవ్వకు ఇల్లు కట్టించి బిగ్ బాస్ హౌస్ అంటూ ఆ ఇంటికి పేరు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయంటూ మీడియా వార్తలు వస్తున్నాయి.

నవదీప్, రవి అదిరింది నుంచి ఎందుకు బయటకు వచ్చారంటే ?

బిగ్ బాస్ లో అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ మోనాల్ కే.. ఎంతంటే ?

మహేష్ బాబుకు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?

కాజల్ కోసం పడిగాపులు కాస్తున్న చిరు..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -