Saturday, April 20, 2024
- Advertisement -

అఖిల్, అభిజిత్ కి చుక్కలు.. అవినాష్ ప్రేమలో మోనాల్..!

- Advertisement -

మొన్నటివరకు సో సో గా సాగిన బిగ్ బాస్ సిజన్ 4.. మెల్లగా ఓ రెంజ్ కు వెళ్లింది. టాస్క్ లతో బిగ్ బాస్ హౌజ్ మెంట్స్ కి చుక్కలు కనపడుతున్నాయి. కంటెస్టెంట్స్ మాత్రం ఎమోషన్స్ ని వదిలేసి గేమ్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఇక బిగ్ బాస్ లో లవ్ ట్రాక్ కూడా జనాలను బానే ఆకట్టుకుంటుంది. బిగ్ బాస్ మొదటి మూడు సీజన్స్ లో ఎవరో ఒకరు మాత్రమే లవ్ ట్రాక్ నడిపేవారు.

అయితే ఈ సారి మాత్రం అఖిల్, అభిజిత్, మోనాల్ లవ్ ట్రాక్ మాత్రం ఊహించని మలుపు తిరిగుతోంది. వాస్తవానికి మొన్నటివరకు వీరి లవ్ ట్రాక్ తోనే బిగ్ బాస్ షో బాగా హైలైట్ అయింది. ఇక నిత్యం వారిపై మీమ్స్ వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు వారి మధ్యలో జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ చేరాడు. అసలే ఇద్దరి మధ్యలో నలిగిపోతున్న మోనాల్ ఇప్పుడు అవినాష్ రాకతో తెలియకుండానే అతనికి అట్రాక్ట్ అవుతోంది.

అభిజిత్, అఖిల్ మాత్రమే పులిహోర కలుపుతున్నారు అనుకుంటుంటే ముక్కు అవినాష్ వారిని మించి పోయేలా మసాలా కూడా కలుపుతున్నాడు. రీసెంట్ ఎపిసోడ్స్ గమనిస్తే అవినాష్ మోనాల్ ను సరదాగా టీజ్ చేస్తూనే మెల్లగా లవ్ ప్రపోజ్ కూడా చేశాడు. తన మాటలతోనే మోనాల్ మనసును గట్టిగానే టచ్ చేస్తున్నాడు. అవినాష్ తీరుతో అభిజిత్, అఖిల్ కు చుక్కలు కనపడుతున్నాయి. అవనాష్ తీరు చూస్తే ఈ వారంలో మోనాల్ ని పూర్తిగా తనవైపు తిప్పుకునేలా ఉన్నాడని అర్దం అవుతోంది.

సూర్య కిరణ్ కి వార్నింగ్ ఇచ్చిన కళ్యాణి.. ఎందుకు ?

బిగ్‌బాస్‌ 4: దోస్తులే.. పగ పట్టారు.. ఈ వారం బయటకు వెళ్లేది ఎవరంటే ?

బాలీవుడ్ స్టార్ హీరోలకే షాక్ ఇస్తున్న ప్రభాస్..!

సురేఖ వాణి కూతురు అప్పుడే తల్లైంది..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -