షాకింగ్ : జబర్దస్త్ లో అనసూయ స్థానంలో శ్రీముఖి..!

8173
bigg boss fame sreemukhi to replace anasuya bharadwaj on jabardasth?
bigg boss fame sreemukhi to replace anasuya bharadwaj on jabardasth?

ప్రస్తుతం బుల్లితెరపై ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్న షో ఏదంటే జబర్దస్త్ అని అందరు చెప్తారు. దాదాపుగా ఏడుళ్ళ నుంచి ఈ షో రన్ అవుతుంది. ప్రేక్షకులను ఎంతో నవ్వించే ఈ షో గురు, శుక్రవారాల్లో వస్తోంది. టాప్ రేటింగ్ ఉన్న ఈ షో వల్ల ఎంతో మంది కమెడీయన్స్ గా పరిచయం అయ్యారు. అంతేకాకుండా వారు సినిమాల్లో నటిస్తూ కూడా బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఈ షోలో చీలికలు ఏర్పడ్డాయి.

జబర్దస్త్ జడ్జ్ నాగబాబు ఈ షో నుంచి తప్పుకుని.. జీ తెలుగులో రాబోతున్న ’లోకల్ గ్యాంగ్’లో చేరిపోయారు. అలానే ఆయన వెంటే.. యాంకర్ అనసూయ కూడా జడ్జ్‌గా ‘లోకల్ గ్యాంగ్’లో సెటిల్ అయిపోయింది. దాంతో జబర్దస్త్ లో అనసూయ ప్లేస్ ఖాళీ అయింది. మొదట.. రెండు పార్టులను రష్మీనే చేస్తుందని టాక్ వచ్చినప్పటికి.. ఇప్పుడూ మాత్రం మరో న్యూస్ వినిపిస్తోంది.

గురువారం రోజు వచ్చే జబర్దస్త్ లో అనసూయ ప్లేస్ లో.. యాంకర్ శ్రీముఖి వస్తుందని సమాచారం. శ్రీముఖి కూడా యాంకరింగ్ చేయడంలో దిట్టా. అందులోను జబర్దస్త్ టీంస్ తో శ్రీముఖికి మంచి పరిచయాలే ఉన్నాయి. ఇక శ్రీముఖి జబర్దస్త్ కు వెళ్తే మంచి హైప్ వస్తుందని టాక్ నడుస్తున్నప్పటికి.. శ్రీముఖి యాంటి ఫ్యాన్స్ మాత్రం శ్రీముఖి జబర్దస్త్ కు వెళ్తే.. ఆ షో మొత్తమే క్లోజ్ అవుతుందని.. గతంలో జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన టీం లీడర్స్ ఓ కొత్త షో చేస్తే అందులో శ్రీముఖే యాంకర్ గా చేసింది.

ఆ షో ఎక్కువ కాలం నిలవలేకపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా.. నిన్ను చూడలేము తల్లి.. గోల తట్టుకోలేము.. నువ్వు జబర్దస్త్ కు వద్దు అని అనసూయ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇక జబర్దస్త్ నాగబాబు ప్లేస్ ను అలీ దక్కించుకున్నాడని తెలుస్తోంది.

Loading...