కౌశల్ పరిస్థితి ఏంటి ఇలా.. నెటిజన్లు కామెంట్స్ ..!

537
bigg boss season 2 winner is back to serials netizen mocks him for not getting film offers
bigg boss season 2 winner is back to serials netizen mocks him for not getting film offers

బుల్లితెర నటుడు కౌశల్ కు మంచి క్రేజ్ ఉంది. తెలుగు బిగ్ బాస్ రెండో సీజన్ లో విజేతగా కౌశల్ నిల్చాడు. అయితే బిగ్ బాస్ లోకి రాకముందు కూడా కౌశల్ సీరియల్స్ లో నటించేవాడు. బిగ్ బాస్ లో ఛాన్స్ రావడంతో కౌశల్ సీరియల్స్ కి గుడ్ బై చెప్పాడు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ లాంటి షోలో విన్నర్ గా నిల్చినప్పటికి.. మళ్లీ సీరియల్స్ లోనే నటిస్తున్నారు.

‘సూర్యవంశం’ అనే సీరియల్‌లో ఆది శంకర్ అనే పాత్రలో నటించేవారు. ఇప్పుడు ఆ పాత్రను మళ్లీ కొనసాగిస్తున్నారు. ‘ఆదిశంకర్ మళ్లీ మీ ముందు వచ్చేశాడు. ఇక మీరు నన్ను రోజూ మిస్ అవ్వరు’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో షేర్ చేశారు. అయితే ఈ పోస్టుపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ కోసం సీరియల్స్ లో నటించడం మానేశావు. ఇప్పుడు సినిమా ఛాన్స్ లు లేక సీరియల్స్ చేస్తున్నావా.. అల్ ది బెస్ట్’ అని వెక్కరిస్తున్నారు. ఇందుకు కౌశల్ రిప్లయ్ ఇచ్చాడు. ‘నటనలో చిన్న పెద్ద అనే తేడా ఏమీ ఉండదు. మనల్ని ప్రేమించేవారు మనల్ని రోజూ చూడగలుగుతున్నారా లేదా అనేదే ముఖ్యం’ అని పేర్కొన్నారు. ఈ పోస్టుతో మళ్లీ ఆయన ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. సోషల్ మీడియాలో కౌశల్ కు కౌశల్ ఆర్మీ ఉంది. బిగ్ బాస్ లో కౌశల్ గెలవడం కోసం ఈ ఆర్మీ ఎంతోగానో పని చేసింది.

‘నటనలో చిన్న పెద్ద అనే తేడా ఏమీ ఉండదు. మనల్ని ప్రేమించేవారు మనల్ని రోజూ చూడగలుగుతున్నారా లేదా అనేదే ముఖ్యం’ అని పేర్కొన్నారు. ఈ పోస్టుతో మళ్లీ ఆయన ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. సోషల్ మీడియాలో కౌశల్ కు కౌశల్ ఆర్మీ ఉంది. బిగ్ బాస్ లో కౌశల్ గెలవడం కోసం ఈ ఆర్మీ ఎంతోగానో పని చేసింది.

Loading...