Saturday, April 20, 2024
- Advertisement -

బిగ్ బాస్ విన్నర్ శ్రీముఖినే.. ఎందుకంటే ?

- Advertisement -

బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడే అసలైన ఆట మొదలైంది. చివరి వరకు ఉండేది ఎవరు ? ఎవరెవరు ఎలా ఆడుతున్నారు ? వారి గేమ్స్ ప్లాన్ ఏంటి అని ప్రతి ఒక్కరు ఇంటి సభ్యులపై రహస్యంగా చేసిన కామెంట్స్ ను బిగ్ బాస్ బహిర్గతం చేశారు. కలిసి ఉంటూనే.. ఒకరిపై ఒకరు ఎలా కామెంట్స్ చేశారో ప్రత్యేక వీడియోస్ ని బిగ్ బాస్ ప్లే చేసి చూపించాడు. దాంతో ప్రతి సభ్యుడి గురించి మిగతా వారు ఏమనుకుంటున్నారో తెలిసింది. అయితే ఇందులో శ్రీముఖి వీడియో హైలైట్ గా నిలిచిందని చెప్పవచ్చు.

బిగ్ బాస్ రియాలిటీ షో అంటేనే మనలో ఉన్న రియల్ క్యారెక్టర్ బయటకు తెప్పించేలా షో ఉంటుంది. అందరు గేమ్ గెలవడానికే ట్రై చేస్తారు. కానీ కొందరు సెంటిమెంట్స్, ఎమోషన్స్ కి గురికావడం వల్ల గేమ్ సరిగ్గా ఆడలేరు. కానీ శ్రీముఖి గేమ్ ని అలీ, శివజ్యోతి, మహేష్ విట్టాలు తమదైన శైలిలో చెబుతున్నారు. వారి విషయాలను గమనించిన శ్రీముఖి.. అలీని, శివజ్యోతిని ప్రశ్నించింది. తాను కేవలం గేమ్ గెలవడం కోసం ఇక్కడకు వచ్చానని.. ఏదైన ముఖం మీద మాట్లాడుతనని.. తాడో పేడో తేల్చుకునే రకం కాబట్టే ఇలా ఉన్ననని శివజ్యోతితో శ్రీముఖి చెబుతుంది. చివరకు టాస్క్ లో భాగంగా మహేష్ విట్టా స్టికర్ ని కుండకి అంటించి పగలగొడుతుంది.

అయితే ఇక్కడ శ్రీముఖి మాటలు.. ఆమె నడుచుకునే తీరుని గమనిస్తే మనకు బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ గుర్తుకు వస్తారు. కౌశల్ కూడా కేవలం గేమ్ కోసమే వచ్చనని పదే పదే చెప్పేవాడు. అయితే ఇక్కడ కౌశల్ కంటే శ్రీముఖికి క్రేజ్, గుర్తింపు ఎక్కువ. సో అందరు బిగ్ బాస్ 3 విన్నర్ శ్రీముఖినే అని భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -