బిగ్ బాస్ 4 రాబోతుంది.. పాల్గోనే 15 మంది సెలబ్రిటీలు వీరే..!

3668
bigg Boss Telugu Season 4 Contestants List Viral In Social Media
bigg Boss Telugu Season 4 Contestants List Viral In Social Media

ఎట్టకేలకు స్టార్ మా బిగ్ బాస్ సీజన్ 4 ప్రోమో విడుదల అయింది. మొత్తానికి ఈ సారి బిగ్ బాస్ ఉండబోతుందని క్లారిటీ వచ్చేసింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు, కరోనా వ్యాప్తి తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని పకడ్భందీగా బిగ్ బాస్ షో నిర్వహణకు చర్యలు తీసుకోబోతున్నారట. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనే కంటెస్టెంట్స్ ను రెండు వారాలు ముందుగానే బిగ్ బాస్ హౌస్‌లో ఉంచి.. ఆ తరువాత వారితో షో కంటిన్యూ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు వారాలు వైద్యులు పర్యవేక్షలో ఉంచి ఆ తర్వాత కరోనా నేపథ్యంలో హెల్త్ ఇష్యూస్ ఏమి లేకుంటే అప్పుడు వారిని కంటిన్యూ చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారట. ఈ తరుణంలో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరన్న ఆసక్తి బుల్లితెర వర్గాల్లో మొదలైంది. హౌస్ లోకి వెళ్లే ఓ 15 మంది సెలబ్రిటీ వీరే అని తెలుస్తోంది. ఇందులో ముగ్గురు హాట్ భామల పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బాస్ ఫేమ్ ముంబై భామ పూనమ్ భజ్వా, ఐటమ్ భామలు హంసా నందిని, శ్రద్ధాదాస్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మిగితవారు వీరేనట..

 1. పూనమ్ భజ్వా
 2. శ్రద్దాదాస్
 3. హంసా నందిని
 4. సింగర్ సునీత
 5. మంగ్లీ (సింగర్)
 6. హీరో నందు (గీతా మాధురి భర్త)
 7. వైవా హర్ష
 8. అఖిల్ సార్దక్
 9. యామినీ భాస్కర్
 10. మహాతల్లి (యూట్యూబ్ సంచలనం)
 11. అపూర్వ
 12. పొట్టి నరేష్ (జబర్దస్త్ కమెడియన్)
 13. మెహబూబా దిల్ సే (యూట్యూబ్ స్టార్)
 14. ప్రియ వడ్లమాని
 15. సింగర్ నోయల్

ఈ పదిహేను మంది పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో ఎంత మంది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారో చూడాలి.

నన్ను ఆ కేసులో ఇరికించింది అతనే : సుమన్

రష్మి‌ హగ్ నన్ను హగ్ చేసుకుంది.. అడ్డంగా బుక్ చేసిన సుధీర్..!

హీరోయిన్ తో ప్రేమలో ఉన్న హీరో ఆది పినిశెట్టి.. ఎవరామె ?

హైపర్ ఆదిని టార్గెట్ చేసిన సద్దాం.. ఊహించని పంచ్..!

Loading...