Friday, March 29, 2024
- Advertisement -

శివబాలాజీకి 50 లక్షలు అని చెప్పి.. ఎంత ఇచ్చారంటే..?

- Advertisement -

ఎన్టీఆర్ హోస్ట్ గా.. తెలుగు బిగ్ బాస్.. 70 రోజుల సమయంతో ముగిసిపోయింది. 16 మంది కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ మొదలు అయ్యి.. ఫైనల్స్ కి వచ్చేసరికి ఐదుగురు మిగిలారు. వారిలో ఒక్కరు బిగ్ బాస్ విన్నర్ గా నిలిచారు. ఇటివలే గ్రాండ్ ఫినాలే దాదాపు నాలుగున్నర గంటలు జరిగింది.

ఈ షోని ఎన్టీఆర్ తన అల్టిమేట్ పెరఫార్మెన్సు తో సక్సెస్ ఫుల్ గా నడిపించాడు. ఇక ఎన్టీఆర్ తన చేతుల మీదుగా ఫైనల్ విన్నర్ ని ప్రకటించిన తీరు అదిరిపోయింది. ఫైనల్ గా శివబాలాజీ, ఆదర్శ్ లో బిగ్ బాస్ సీజన్ విన్నర్ గా శివబాలాజిని ప్రకటించడం… ఇక ఎన్టీఆర్, శివ బాలాజీ కి బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ ట్రోఫి తోపాటు 50 లక్షల ప్రైజ్ మని అందించడం ఆ ట్రోఫీ ని, మనీ ని శివ తీసుకుని హ్యాపీగా ఫ్యామిలీని కలవడం అన్ని బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే లో సూపర్. సో మొత్తానికి బిగ్ బాస్ సీజన్ వన్ ఈ విధంగా ముగిసింది. బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ శివబాలాజీ అయితే బిగ్ బాస్ షో ని ఆద్యంతం రక్తి కట్టించిన ఎన్టీఆర్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇక ముందుగా చెప్పినట్లుగానే 50లక్షల ప్రైజ్ ని శివ బాలాజీకి అందజేశారు ఎన్టీఆర్. ఒక రకంగా శివ బాలాజీకి బిగ్ బాస్ మోసం చేసినట్టే అని అంటున్నారు.

ఎందుకంటే అతనికి ఇచ్చిన 50లక్షల్లో 30 శాతం టాక్స్ కట్టాల్సి ఉంటుంది. అంటే 15లక్షలన్నామాట. ఇక మిగిలింది 35 లక్షలు. ఏది ఏమైన ఇండైరెక్ట్ గా హ్యాండ్ ఇచ్చారని అనుకుంటున్నారు నెటిజన్లు. పైగా ఫ్రైజ్ మనీ పెంచుతారు అనుకున్నారు. అలా ఏం జరగలేదు. ఇక బిగ్ బాస్ వాయిస్ చెప్పిన వ్యక్తిని చూపిస్తారు అనుకున్నారు. అది కూడా జరగలేదు. మొత్తానికి శివబాలాజీ కి అన్నివారాలు ఉన్నందుకు గాను ప్రత్యక్షంగా ఒక కోటిరూపాయల వరకూ దక్కిందని అంటున్నారు నెటిజన్లు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -