Thursday, April 25, 2024
- Advertisement -

పదేళ్ల పాటు అతడితో.. ఇప్పుడు మరొకడితో ఆ హీరోయిన్!

- Advertisement -

బిపాశాబసు గురించి కొత్తగా వివరించనక్కర్లేదు. హిందీ హీరోయినే అయినా ఆమె తెలుగు వాళ్లకూ బాగా పరిచయమే. ఒకటీ రెండు తెలుగు సినిమాల్లో నటించిన బిపాశా చాలా సంవత్సరాలుగా

పరిచయం ఉంది. కేవలం హీరోయిన్ గానే గాక జాన్ అబ్రహం గర్ల్ ఫ్రెండ్ గా కూడా బిపాశా అందరికీ పరిచయం. వాళ్లిద్దరూ చాలా సంవత్సరాల పాటు అతడి ప్రేమలో మునిగి తేలింది. 

 

దాదాపు పదేళ్ల పాటు వారిద్దరూ డేటింగ్ చేశారు. అప్పట్లో వీరి ప్రేమ బహిరంగ రహస్యమే. కలిసి కనిపించే వారు. తరచూ వార్తల్లోకి వచ్చే వారు. అలా పదేళ్ల పాటు కొనసాగిన బిపాశా జాన్ ల ప్రేమ.. తర్వాత బ్రేకప్ అయ్యింది. ఎవరికి వారయ్యారు. మరి ఒక ప్రేమ బ్రేకప్ అయితే.. మరొకరి దగ్గర ప్రేమను వెదుక్కొనే రోజులు ఇవి. కాబట్టి.. బిపాశా కూడా అదే పని చేసింది. ఆమె తాజాగా మరో ప్రేమికుడిని వెదుక్కొంది.

 

అతడే కరణ్ సింగ్ గ్రోవర్. హిందీసీరియళ్ల నటుడు అయిన ఇతడితో ఇప్పుడు బిపాశా చాలా బిజీగా ఉంది. వీరిద్దరూ కలిసి విహరిస్తున్నారు. ఇప్పుడు బిపాశా అతడి ప్రేమలో ఉందట. ఈ విషయం బిపాశా ఇంట్లో వాళ్లకు కూడా తెలిసినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో బిపాశాను ఆమె తల్లి దండించిందని తెలుస్తోంది. అయితే తల్లిచేత చెప్పించుకొనే చిన్న వయసు కాదేమో బిపాశాది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -