బిగ్‌బాస్‌ 4 సీజన్ లో బిత్తిరి సత్తి ?

446
bithiri sathi may contest in bigg boss telugu season 4 show
bithiri sathi may contest in bigg boss telugu season 4 show

ప్రముఖ వీ6 ఛాన‌ల్‌లో తీన్మార్ వార్త‌ల ద్వారా బిత్తిరి సత్తి ఎంత ఫేమస్ అయ్యాడో అందరికి తెలిసింది. ఈ తీన్మార్ ద్వారా చాలా ఎదిగాడు సత్తి. అతని పేరు ఇప్పటికే అందరు బిత్తిరి సత్తే అనుకుంటారు. కానీ అతని అసలు పేరు రవి. అయితే వీ6 నుంచి బయటకు వచ్చిన తర్వాత టీవీ9 ఇస్మార్ట్ న్యూస్‌లో చేశారు సత్తి. ఇక్కడ బానే నవ్వించాడు.

అయితే తాజాగా టీవీ9లో కూడా తన ఉద్యోగం మానేశాడు. ఇందుకు కారణం ఏంటో తెలియాల్సి ఉంది. కానీ తాజాగా తెలిసిన స‌మాచారం ప్ర‌కారం.. స‌త్తి త్వ‌ర‌లో ప్రారంభం కానున్న బిగ్ బాస్ 4 షో లో అవకాశం వ‌చ్చిందంటూ ఓ వార్త హ‌ల్చ‌ల్ చేస్తుంది. గ‌తంలో టీవీ9లో ప‌నిచేసిన దీప్తి బిగ్‌బాస్ షోలో పాల్గొంది. ఆ తర్వాత ఆమె య‌థావిధిగా టీవీ కార్య‌క్ర‌మాల్లో మ‌ళ్లీ బిజీ అయింది. ఇప్పుడు సత్తి కూడా ఇలానే బిగ్ బాస్ షో కోసం టీవీ9లో ఉద్యోగం మానేశారని తెలుస్తోంది.

త్వ‌ర‌లో బిగ్‌బాస్ షో 4వ సీజ‌న్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో అందులో పాల్గొన‌డం కోసం ముందుగానే స‌త్తి రాజీనామా చేసి ఉంటార‌ని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే బిగ్ బాస్ లో పాల్గొనాలంటే ప్రస్తుత చేస్తున్న ఉద్యోగం మానేయాల్సిన పని లేదు. అయితే బిగ్ బాస్ లో పాల్గొనాలంటే కొన్ని రోజులు ఉద్యోగాం లీవ్ పెట్టాలి. అందుకు సంస్థ ఒప్పుకోకుంటే మానేయాల్సిందే. అందుకే సత్తి టీవీ9లో ఉద్యోగం మానేసినట్లు సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.

రేణూ దేశాయ్‌కు పెళ్లి అయిపోయిందా ?

మోక్షజ్ఞకి హీరో కావడం ఇష్టం లేదేమో.. అందుకే ఇలా..!

ఆఫర్లు లేక మళ్లీ జబర్దస్త్ లో అడుగుపెడుతున్న షకలక శంకర్..!

హీరోయిన్ సుకన్య ఆ పనులు చేయడానికి కారణం ఏంటి ?

Loading...