భార్యతో సరసాలు.. నెటిజన్లు ఫైర్..!

8217
Bollywood Celebrity Rajeev Sen Photo Goes Viral
Bollywood Celebrity Rajeev Sen Photo Goes Viral

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ వైరస్ వ్యాప్తిని ఆరికట్టెందుకు సెలబ్రిటీలు కూడా సామాన్య ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇంకోందరు తమకు తోచినంత సాయం కూడా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి విరాళాలు కూడా అందిస్తున్నారు. అయితే తాజాగా బాలీవుడు నటుడు చేసిన పనికి నెటిజన్లు అతనిపై ఫైర్ అవుతున్నారు. అయితే ఇంతకీ ఆ ప్రముఖ సెలబ్రెటీ ఎవరు అతను ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం.

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ సుస్మితాసేన్ గురించి తెలియని వారుండరు. అయితే ఆమె సోదరుడు రాజీవ్ సేన్ గురించి కూడా తెలిసే ఉంటుంది. అయితే అతడు పెద్ద సెలబ్రిటీ కాకపోయినప్పటికీ తన సోదరి పేరుతో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. అయితే తాజాగా రాజీవ్ సేన్ తన భార్యతో దిగినటువంటి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో రాజీవ్ సేన్ మరియు ఆయన భార్య ఇద్దరు సరసాలాడుతున్న టైంలో తీసుకున్న ఫోటోలను షెర్ చేశాడు.

దాంతో ఈ ఫోటోలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి ఇలాంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం కరెక్ట్ కాదు. అంతే గాక ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశంలోని ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని మరియు అంతేగాక మనుషుల మధ్య సామాజిక దూరం పాటించాలని చెప్పినప్పటికీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఇలాంటి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఏంటని నెటిజన్లు అంటున్నారు.

Loading...