Thursday, April 18, 2024
- Advertisement -

షూట్ చేసి ఆపేసిన మెగా హీరో సినిమా

- Advertisement -

విజేత అనే సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమ లో కి అడుగు పెట్టిన మెగా హీరో కళ్యాణ్ దేవ్. మొదటి సినిమా తో పర్వాలేదని అనిపించినా ఈ నటుడు తన రెండో సినిమా ని కూడా మొదలెట్టాడు. పులి వాసు దర్శకత్వం లో రానున్న ఈ సినిమా అందరినీ ఎంతగానో మెప్పిస్తుంది అనే ధీమా తో ఉన్నాడు దర్శకుడు. అయితే నిజానికి ఈ సినిమా ని చేయాల్సింది సుధీర్ బాబు. కానీ చివరి నిమిషం లో సినిమా లాంచ్ అయ్యాక, సినిమా కథ నచ్చక, ఆయన బయటకి వచ్చేసాడు. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ అలా కళ్యాణ్ దేవ్ చేతుల్లోకి వెళ్ళిపోయింది.

ఇప్పుడు సినిమా కి సంబందించిన మొదటి షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టి, ఆ తర్వాత ఎందుకో సినిమా ని ఆపేయడం జరిగింది. మొదటి షెడ్యూల్ రషెస్ చూసాక సినిమా స్క్రిప్ట్ ని ఇంకా మెరుగుపరచాలని ధ్యేయం తో ఉన్నారట దర్శక నిర్మాతలు. దర్శకుడు ప్రస్తుతం తన టీమ్ తో కూర్చొని మరింత శ్రద్ద తో స్క్రిప్ట్ ని పూర్తి చేయాలనే తపన తో ఉన్నారు. ఈ నెలాఖరు కి రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది అని తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -