Friday, April 19, 2024
- Advertisement -

బాలయ్యపై బన్నీ షాకింగ్ కామెంట్స్.. ఫైర్ అయిన అభిమానులు!

- Advertisement -
bunny comments on satakarni

టాలీవుడ్ లో స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్‌కు ఏ రెంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. నాలుగు వ‌రుస సూపర్ హిట్స్ సాధించి మంచి జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం హ‌రీష్ శంక‌ర్ దర్శకత్వంలో దువ్వాడ జ‌గ‌న్నాథం అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఇటివలే కూతురు పుట్ట‌డంతో ఆ స‌క్సెస్‌ను బ‌న్నీ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ ఇటివలే చేసిన కామెంట్లు ఇండ‌స్ట్రీలో క‌ల‌క‌లం రేప‌డంతో పాటు అత‌డిపై నంద‌మూరి ఫ్యాన్స్ ఫైర్ అయ్యేందుకు కార‌ణంగా మారాయి.

రీసెంట్ గా వైజాగ్ వెళ్లిన బన్నీ అక్కడ కొందరు మెగా ఫ్యాన్స్ తో మీట్ అయ్యాడ‌ట‌. ఈ నెపథ్యంలో అల్లు అర్జున్ బాల‌య్య 100వ సినిమా గురించి ప‌రోక్షంగా సెటైర్లు వేసిన‌ట్టు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జరుగుతోంది. అక్కడ మెగా ఫ్యాన్స్‌తో బ‌న్నీ మాట్లాడుతూ ‘ఈ సారి సంక్రాంతి మనదే’ అని వ్యాఖ్యానించినట్టు టాక్.  ఆ మాట ఆ నోటా ఈ నోటా నంద‌మూరి ఫ్యాన్స్ చెవిలో ప‌డింద‌ట‌. దాంతో.. అల్లు అర్జున్ శాత‌క‌ర్ణిని టార్గెట్‌గా చేసుకునే బాలయ్య శాతకర్ణి చిత్రం కన్నా ఖైదీ నెంబర్ 150నే మంచి విజయం సాధిస్తుందన్న అర్థంలోనే ఆ వ్యాఖ్యలు చేశాడని నంద‌మూరి అభిమానులు పైర్ అవుతున్నారు.

దీంతో నందమూరి ఫ్యాన్స్ అల్లు అర్జున్‍పై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. గతంలో కూడా అల్లు అర్జున్ ప‌వ‌న్ అభిమానులను ఉద్దేశించి చేసిన చెప్ప‌ను బ్ర‌ద‌ర్ డైలాగ్స్ ప‌వ‌న్ అభిమానులను హ‌ర్ట్ చేయ‌డంతో ప‌వ‌న్ అభిమానులు సైతం బన్నీ పై విరుచుకుప‌డిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి బ‌న్నీ ఈ వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలిచాడు.

Related

  1. బాలయ్య, ఎన్టీఆర్ మధ్య మరోసారి గొడవలు?
  2. రోజాకు బాలయ్యతో దీపావళి చాలా స్పెషల్!
  3. పవన్ కి షాక్ ఇచ్చిన అల్లు అర్జున్!
  4. చిన్నారి ప్రాణాలు కాపాడిన హీరో అల్లు అర్జున్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -