Saturday, April 20, 2024
- Advertisement -

రంగస్థలంకు మించి బన్నీ సినిమా..!

- Advertisement -

అల్లు అర్జున్ తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. అలానే కెరీర్ లో మొదటి ఇండస్ట్రీ హిట్ ను కూడా బన్నీ దక్కించుకున్నాడు. ఈ క్రమంలో అల్లు అర్జున్ తర్వాతి సినిమా మాములుగా ఉంటే ప్రేక్షకులు ఎంజాయ్ చేయాలేరు. అందుకే అంతకు మించి ఉండేలా అల్లు అర్జున్ తన తదుపరి సినిమాని ప్లాన్ చేస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ తదుపరి సినిమా రాబోతుంది.

ఈ సినిమాలో అల్లు అర్జున్ మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. రంగస్థలం చిత్రంలో చిట్టిబాబు తరహాలో బన్నీని కూడా చూపించాలని మొదట సుకుమార్ అనుకున్నాడు. బన్నీ మాత్రం చిట్టిబాబు పాత్రను మించి మరింత మాస్ గా పాత్ర చాలా సహజం గా కనిపించేలా గడ్డం.. జుట్టు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అలానే బరువు విషయంలో కాస్త శ్రద్ద పెట్టినట్లుగా తెలుస్తోంది. రెడ్ సాండిల్ స్మగ్లింగ్ లారీ డ్రైవర్ పాత్రలో బన్నీ కనిపించబోతున్నాడని… ఆ పాత్రకు తగ్గట్లుగా ఉండేందుకు బన్నీ ఏకంగా రెండు నెలల పాటు కష్టపడబోతున్నట్లుగా తెలుస్తోంది.

సినిమాలోని బన్నీ లుక్ ను రివీల్ చేయడం లేదు. ఇప్పటికే బన్నీ బయటకు వెళ్తే క్యాప్ పెట్టుకుని వస్తున్నాడు. మరికొన్ని రోజుల పాటు బన్నీ బయట కనిపించక పోవచ్చు అంటున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ కంప్లీట్ కాగా.. రెండో షెడ్యూల్ ను వచ్చే నెల ప్రారంభం కానుంది. ఈ ఏడాది లేకుంటే వచ్చే ఏడాది సమ్మర్ కు ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -