Thursday, April 18, 2024
- Advertisement -

జబర్దస్త్ కమెడియన్ పై కేసు.. అసలు ఏం జరిగింది?

- Advertisement -
Case filed on Jabardasth Comedian Avinash

ప్రస్తుతం అందరిని బాగా నవ్విస్తున్న ప్రోగ్రాం.. జబర్దస్త్. ఈ షో వస్తుందంటే.. అందరూ.. టివీలకు ముందునుంచి లేవరు. అయితే ఈ కార్యక్రమం మీదన పొగడ్తల ఏ రెంజ్ లో వినిపిస్తున్నాయో.. అదే రెంజ్ లో విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి సంబంధించిన వార్తలు తరచూ మీడియాలో వచ్చే విషయం తెలిసిందే. ఈ ప్రోగ్రామ్ మీద న్యాయస్థానాలు కూడా అప్పుడప్పడు వ్యాఖ్యలు చేస్తున్నారు.

తాజాగా ఈ కార్యక్రమంలో స్కిట్స్ వేసే కమెడియన్ పుణ్యమా అని.. ఈ కార్యక్రమం పేరు మరోసారి వార్తల్లోకి ఎక్కేలా చేసింది. ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనే మాస్ అవినాష్ పై తాజాగా కేసు నమోదైంది. షో చేస్తామంటూ అడ్వాన్స్ తీసుకొని.. ప్రోగ్రాంకు రాకుండా మోసం చేసిన వైనంపై తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు కేసునమోదు చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన వేణుగోపాల్ రెడ్డి.. కేటీ క్రియేషన్స్ పేరుతో ఈవెంట్స్ ను నిర్వహిస్తుంటారు.

మహా శివరాత్రి సందర్భంగా ఈ నెల 24న ఒక కార్యక్రమం కోసం జబర్దస్త్ ఫేం మాస్ అవినాష్ తో.. ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందంలో భాగంగా అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు. అయితే.. అవినాష్ కార్యక్రమానికి హాజరు కాలేదని.. దీంతో ఈవెంట్ సంస్థకు చెడ్డపేరు వచ్చిందంటూ ఫిర్యాదు చేశారు. ప్రోగ్రాం రోజున ఫోన్ స్విచ్ఛాప్ సుకొని ఉండటంతో తమ సంస్థ తీవ్ర ఇబ్బందికి గురైందని ఫిర్యాదుదారు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

{youtube}TWXAM3-Pnms{/youtube}

Related

  1. జబర్దస్త్ కమెడియన్ భార్య ఆత్మహత్య
  2. జబర్దస్త్ షోకి చెక్ పెట్టేందుకు ప్లాన్?
  3. జబర్దస్త్ నరేష్ వయసు ఎంతంటే?
  4. జబర్దస్త్ గురించి ఎవరికి తెలియని నిజాలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -