Friday, April 26, 2024
- Advertisement -

చిరు సైరా ఫోటో లీక్‌!

- Advertisement -

హీరో చిరంజీవి చాలా ప్ర‌తీష్టాత్మ‌కంగా తీసుకుని న‌టిస్తున్న సినిమా సైరా న‌ర‌సింహారెడ్డి.ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.హైదరాబాద్ లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్ లో షూటింగ్ జరుగుతోంది. సినిమాలో కొన్ని కీలక యుద్ధ సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తున్నారు.తాజాగా ఈ సినిమా షూటింగ్ నుండి ఓ ఫోటో లీక్ అయింది.

కొందరు వ్యక్తులు గుర్రాల మీద కనిపిస్తున్నట్లుగా లీకైన ఈ ఫోటో ఎన్నో విషయాలను బయటపెడుతోంది. కథ ప్రకారం సినిమాలో కొన్ని సన్నివేశాలను బ్లాక్ అండ్ వైట్ లో ఉంటాయని సమాచారం. అప్పటి నాగరికత, కాస్ట్యూమ్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌య‌న‌తార న‌టిస్తుంది.విజ‌య్ సేతుప‌తి,అమితాబ్ బచ్చన్ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.ఈ సినిమాను మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -