Thursday, April 18, 2024
- Advertisement -

చిరు, రాజశేఖర్ మధ్య గొడవలు.. ఇప్పటివి కావు..!

- Advertisement -

గురువారం మూవీ ఆర్టిస్ట్స్‌ అసోషియేషన్‌ నిర్వహించిన మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో సమస్యలు ఏర్పడిన విషయం తెలిసిందే. స్టేజ్ పై రాజశేఖర్ అరోపణలు చేయడం.. వాటిని చిరు, మోహన్ బాబు, కృష్ణంరాజు లాంటి సినీ పెద్దలు ఖండించటం జరిగింది. అయితే చిరు, రాజశేఖర్ల మధ్య వివాదం ఇప్పటిది కాదు.. చాలా ఏళ్ల క్రితమే ఈ సమస్య మొదలైంది.

తన మాటలకు ఏ మాత్రం విలువ ఇవ్వకుండా స్టేజ్ పైన మాలోని సమస్యలను ప్రస్తావించటంపై చిరంజీవి ఫైర్ అయ్యారు. ఈ కార్యక్రమంలో రసాబాస చేయాలన్న ఉద్దేశంతోనే రాజశేఖర్ ఇక్కడికి వచ్చాడని.. ఆయన మీద చర్యలు తీసుకోవాలని మా కమిటీకి చెప్పారు. మోహన్ బాబు, కృష్ణంరాజులు కూడా రాజశేఖర్ తీరును తప్పుపట్టారు. అయితే చిరు, రాజశేఖల మధ్య వివాదం ఇప్పటిది కాదు. 2003లోనే మొదలైంది. తమిళ్ లో సూపర్ హిట్ అయిన రమణ మూవీని తెలుగులో రీమేక్ చేసేందుకు రాజశేఖర్ ప్రయత్నాలు చేశాడు.

అయితే ఈలోగా ఈ మూవీ హక్కులను అల్లు అరవింద్ సొంతం చేసుకున్నాడు. దాంతో చిరంజీవి హీరోగా ఠాగూర్ పేరుతో ఈ సినిమా రిలీజ్ అయ్యి.. బిగ్గేస్ట్ హిట్ అయింది. దాంతో రాజశేఖర్, చిరుల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత కూడా జీవితా రాజశేఖర్ దంపతులు ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు.

ఒక దశలో మెగా అభిమానులు రాజశేఖర్‌ కారుపై దాడి చేయటంతో పరిస్థితి మరింత సీరియస్‌ అయ్యింది. ఆ సమయంలో స్వయంగా రాజశేఖర్‌ ఇంటికి వెళ్లిన మెగాస్టార్‌, తన అభిమానుల వల్ల రాజశేఖర్‌ ఫ్యామిలీకి జరిగిన ఇబ్బందికి క్షమాపణలు కూడా చెప్పాడు. ఇప్పుడు మళ్లీ మా కార్యక్రమంలో రాజశేఖర్ తన ఇష్టానుసారంగా ప్రవర్తంచడంపై చిరంజీవి ఫైర్ అయ్యాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -