కలర్స్ స్వాతి ఇప్పుడు ఎలా ఉందో చూడండి

1304
Colors Swathi Shocking Transformation Swathi Reddy
Colors Swathi Shocking Transformation Swathi Reddy

డేంజర్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన అమ్ముడు కలర్స్ స్వాతి. అష్టా చమ్మా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. కొన్ని సినిమాల్లో నటించిన ఈ అమ్మడు 2018వ సంవత్సరంలో వికాస్ అనే పైలెట్ ని పెళ్లి చేసుకుంది.

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి. అంతేగాక తన వివాహం అయినప్పటి నుంచి కలర్స్ స్వాతి ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపించలేదు. అయితే తాజాగా ఆమె కొన్ని ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో తన అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ ఫోటోలను చూసిన అటువంటి స్వాతి అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.

తెలుగుదనం ఉట్టిపడేలా లావుగా ఉండే స్వాతి ఒక్కసారిగా చాలా సన్నగా అయిపోయింది. స్వాతికి ఏమైందని కొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇందుకు కారణలు ఉన్నాయి. సినిమాల కోసం మళ్లీ సన్నబడుతుందని అంటున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం కలర్స్ స్వాతి గతంలో నటించిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్నటువంటి చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.

Loading...