బ్రహ్మానందం సినిమాలకు గుడ్‌ బై ?

974
Comedian Brahmanandam Takes Shocking Decision
Comedian Brahmanandam Takes Shocking Decision

బ్రహ్మానందం.. ఈ పేరు వినగానే మన ముఖంలో స్మైల్ ఆటోమెటిక్ గా వస్తుంది. బ్రహ్మానందం ఎంత ఫేమసో అందరికి తెలిసిందే. ఆయన ఎక్స్‌ప్రెషన్స్.. డైలాగ్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారు. కొన్నేళ్లుగా కామెడీకి కేరాఫ్ అడ్రస్ తానే అన్నట్లుగా వెండితెరపై కొనసాగిన ఆయన.. ఇకపై సినిమాల్లో నటించబోరని తెలుస్తోంది.

సినిమాలకు ఆయన గుడ్ బై చెప్పేశారని సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. అంతేకాకుండా బ్రహ్మానందం ఈ మధ్యన సినిమాలు చేయడం తగ్గించారు. ఇండస్ట్రిలో కొత్త కమెడియన్స్ హవా నడుస్తుండటంతో బ్రహ్మానందంకు అవకాశాలు తగ్గాయి. కానీ వెండితెరపై బ్రహ్మి కామెడీ మిస్సయ్యామనే మాట మాత్రం వాస్తవం. మరోవైపు కొత్తవారికి అవకాశం ఇవ్వాలని, ఎప్పుడూ మేమే ఉండాలని కోరుకోవడం సరికాదని కూడా బ్రహ్మానందం పలుమార్లు చెప్పిన సందర్భాలున్నాయి.

ఈ నేపథ్యంలో ఇకపై సినిమాల్లో నటించకూడదని బ్రహ్మీ డిసైడ్ అయ్యారట. కాకపోతే ప్రేక్షకలోకానికి పూర్తిగా దూరం కాకూడదనే ఉద్దేశంతో డైలీ సీరియల్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. కామెడీ టచ్ ఇస్తూ తన పాత్రకు అధిక ప్రాధాన్యత ఉండేలా బుల్లితెర దర్శకులు వినిపించిన కొన్ని కథలు బ్రహ్మికి బాగా నచ్చాయట. వాటిపై త్వరలోనే ఆయన నిర్ణయం ప్రకటించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇదిగనక నిజమైతే ప్రేక్షకులకు బ్రహ్మీ కామెడీని రోజు ఎంజాయ్ చేయవచ్చు. మరి ఈ వార్తలపై బ్రహ్మీ ఎలా స్పందిస్తారో చూడాలి.

టీవీ సీరియల్ నటి నవ్యకు కరోనా..!

బాలకృష్ణ పిలువు వేరే.. అలా అంటే కొట్టేస్తా : నగ్నం హీరోయిన్ కామెంట్స్

శ్యామ్, సాయిసుధ కేసులో సంతకాన్ని మార్ఫింగ్.. కొత్త ట్విస్ట్..!

వర్మ ‘పవర్ స్టార్’ సినిమా హీరో దొరికేశాడు..!

Loading...