సుధీర్ అన్ని నాలుగు గోడల్ మధ్యలోనే చేస్తాడు.. సుధీర్ కి ప్రదీప్ పంచ్..!

510
Dhee Champions Double Meaning Punches On Sudigali Sudheer
Dhee Champions Double Meaning Punches On Sudigali Sudheer

ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ ఛాంపియన్స్ ఏ షో చేసిన సుడిగాలి సుధీర్ అమ్మాయిల పిచ్చోడిగా నటిస్తూ ఉంటాడు. రియల్ లైఫ్ లో అమ్మాయిలతో మట్లాడానికే భయపడే సుధీర్.. బుల్లితెరపై మాత్రం అమ్మాయిల అంటే పిచ్చిలాగా నటిస్తూ ఉంటాడు. తాజాగా ఢీ ఛాంపియన్స్ వచ్చే వారానికి సంబంధించిన ప్రోమోలో ఇదే జరిగింది.

‘ఢీలో 10 మంది ఛాంపియన్స్ ఉండేటప్పుడు పండగలా ఉండేది.. ఇంకో ఆరుగురు వైల్డ్ కార్డ్ ఛాంపియన్స్ రాబోతున్నారంటే.. పండగ సార్!! పండగ అంతే’ అంటూ ఎనర్జిటిక్ యాంకరింగ్‌తో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు యాంకర్ ప్రదీప్. ఢీ షో అంటే ఎంటర్టైన్మెంట్ ఓ రేంజ్‌లో ఉంటాది.. అలాంటిది ఇంత గ్యాప్ ఇచ్చాక ఎంటర్టైన్మెంట్ ఏ రేంజ్‌లో ఉంటాదో మీ ఊహకే వదిలేస్తున్నాం’ అంటూ కిర్రాక్ డాన్స్ పర్ఫామెన్స్‌ను పరిచయం చేశారు ప్రదీప్. ఇక ఈ ప్రోమోలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. ‘ఇంతకీ ఈ లాక్ డౌన్‌‌లో ఏం చేశావ్’ అని సుధీర్‌ని ప్రదీప్ అడగడంతో.. పక్కనే ఉన్న హైపర్ ఆది ‘దేశానికి లాక్ డౌన్ ఉంటుంది కాని.. ఆయన దేహానికి లాక్ డౌన్ ఉండదు’ అంటూ పంచ్ వేశాడు.

‘నా గొడవ ఎందుకు ఇంతకీ నువ్వేం చేశావ్ చెప్పు అని సుధీర్.. ప్రదీప్‌ని అడగ్గా’.. ‘నాదేం ఉంది భయ్యా.. ఆ నాలుగు గోడల మధ్య బోర్ కొట్టింది’ అని చెప్పాడు. ‘మరి నాకేం బోర్ కొట్టలేదే’ అంటూ సుధీర్ అనడంతో.. ‘నువ్వు అన్నీ నాలుగు గోడల మధ్యలోనే కదా చేసేది నీకేం బోరు కొడుతుంది’ అంటూ ప్రదీప్ పగిలిపోయే పంచ్ వేయడంతో సుధీర్ షాక్ అయ్యాడు. ఢీ మేనేజర్ ఫస్ట్ ఫోన్ చేసి నన్నే రమ్మన్నాడు తెల్సా అంటూ సుధీర్ అనడంతో ఎందుకు సెట్ శానిటైజ్ చేయడానికా అని ప్రదీప్ పంచ్ వేయగా.. జడ్జిగా ఉన్న శేఖర్ మాస్టర్ అందుకుని సుధీర్ బాడీకి కూడా శానిటైజ్ చేయాలని డబుల్ మీనింగ్ పంచ్ అందుకున్నారు. లాక్ డౌన్ తర్వాత ఢీ నుంచి వచ్చిన ప్రోమో కావడంతో యూట్యూబ్ లో తెగ వైరల్ అవుతుంది.

దర్శకుడి కొడుకుతోనే అనుష్క పెళ్లి.. నిజమే..?

ఫోటో పెట్టి పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన నిహారిక..

పెళ్లికి రెడీ అవుతున్న యంగ్ హీరో సందీప్ కిషన్..?

మోక్షజ్ఞ లుక్ గురించి ట్రోల్.. మధ్యలోకి ఎన్టీఆర్ ను లాగారు..!

Loading...