పవన్ కోసం స్పెషల్ పడవ.. ఎందుకంటే ?

772
Director Krish creates a special boat set for Pawan Kalyan
Director Krish creates a special boat set for Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఇటీవలే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమా రీమేక్ లో పవన్ నటిస్తున్నారు. ఈ సినిమాకి లాయర్ సాబ్,వకీల్ సాబ్ అనే పేర్లు పరిశీలిస్తున్నారు.

ఇదే కాకుండా మరో రెండు సినిమాలు కూడా చేస్తున్నారు. అందులో ఒకటి క్రిష్ డైరెక్షన్ లో. మరొకటి హరిష్ శంకర్ డైరెక్షన్ లో. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండనుందట. సాయన్న జీవిత కథ ఆధారంగా తెరకెక్కే ఈమూవీని పవన్ కళ్యాణ్ కూడా పాన్ ఇండియా తరహాలో తొలిసారి తెరకెక్కించనున్నాడు. భూమిక హీరోయిన్ గా తీసుకుంటున్నారట.

సాధ్యమైన త్వరగా ఈ మూవీ పూర్తి చేయాలనీ చూస్తున్నారు. ఇందుకోసం ఓ పడవ సెట్ ని హైదరబాద్ లో ఆర్ట్ డైరెక్టర్ రెడీ చేస్తున్నాడు. సినిమాలో చాలా భాగం ఇందులోనే షూట్ చేస్తారట. ఖుషీ తర్వాత పవన్,భూమిక జోడీగా వస్తున్న ఈ సినిమా లో మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఉన్నారట. ఇటీవల బాలయ్య నటించిన రూలర్ మూవీలో భూమిక కీలక పాత్ర పోషించింది.

Loading...