నిన్ను బికినీలో చూడాలని నా కోరిక.. యాంకర్ కి వర్మ షాక్..!

1175
Director Ram Gopal Varma Praises Anchor In Interview
Director Ram Gopal Varma Praises Anchor In Interview

రామ్ గోపాల్ వర్మ.. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన సంచలన దర్శకుడు. ఈ మధ్య అతని సినిమాలు చూసి.. వర్మేనా ఈ సినిమాలు తీసేది అని ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయం పక్కన పెడితే వర్మ ఏం అనిపిస్తే అది మాట్లాడే రకం. అతను ఏం మాట్లాడిన సంచలనం అవుతూ ఉంటుంది. యూట్యూబ్‌లో పాపులర్ ఛానల్స్‌కి ఇంటర్వ్యూలు ఇస్తూ సంచంచనాలను రేపుతూ ఉంటాడు.

తాజాగా మన స్టార్ యూట్యూబ్ ఛానల్ యాంకర్ వర్మను ఇంటర్వ్యూ చేస్తూ అతన్ని ఎలాంటి విషయాలైతే అడగకూడదో.. సరిగ్గా అదే టాపిక్ తీసుకువచ్చింది. ఆ యాంకర్ రీసెంట్ గా ఏ యాంకర్ ని చూస్తే మీకు వావ్ అనిపించింది అని వర్మని అడిగింది. దాని వర్మ జవాబు ఇస్తూ.. చాలామంది ఉన్నారు. అందులో నువ్వు కూడ ఉన్నావ్ అంటూ చెప్పాడు. అతని ఆన్సర్‌కి తెగ సిగ్గుపడిపోయిన యాంకర్.. థాంక్యూ సార్ అంటూ మరో చిలిపి ప్రశ్న వేసింది. ‘మనిషికి కోరికలు అనేవి కామన్.. మీకు ఇప్పటి వరకూ తీరని కోరికలు ఏమైనా ఉన్నాయా’? అని వర్మను అడగ్గా.. ‘నాకు ఒక కోరిక కలిగింది అంటే తీర్చుకోకుండా ఉండటం అనేది ఇప్పటి వరకూ జరగలేదు.

ఏ టైంలో ఎలాంటి కోరిక కలిగినా వెంటనే తీర్చేసుకుంటా. కోరికల్ని నేను ఎంజాయ్ చేస్తూ ఉంటా.. అందుకే మళ్లీ మళ్లీ తీర్చుకుంటూ ఉంటా. ఒకవేళ నా కోరిక తీరనిది అయితే.. దాన్ని నేను వెంటనే మర్చిపోతా. దాన్ని పట్టుకుని వేలాడను. నిజానికి నిన్ను (యాంకర్) బికినీలో చూడాలని ఉంది.. నేను నీకు ఆఫర్ ఇస్తా బికినీలో ఓ రోల్ చేయడానికి నీకు ఇష్టమైతే చేయిస్తా. లేదంటే ఆ కోరికను వదిలేసుకుంటా’ అంటూ మనసులో ఉన్న కోరికను చెప్పకనే చెప్పేశారు వర్మ. దాంతో ఆ యాంకర్ బిత్తరపోయి చూసింది. అయితే గతంలో వర్మ ఇదే తరహాలో మరో చానెల్ యాంకర్ అందం గురించి పొగిడారు.

Loading...