Wednesday, April 24, 2024
- Advertisement -

రామ్ కి రెడ్ ఇంత బాడ్ నేమ్ తెస్తుందా..?

- Advertisement -

హీరో రామ్ చాలా రోజుల తర్వాత ఇటీవలే పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తో హిట్ అందుకున్నాడు.  ఇద్దరికీ ఈ సినిమా హిట్ ఎంతో హిట్ కాగ యా సినిమా హిట్ ఇద్దరికీ మళ్ళీ లైఫ్ ఇచ్చిందని చెప్పాలి.. ముఖ్యంగా శంకర్ పాత్రకు తాను తప్ప మరెవరు సరిపోరు అన్న రేంజ్ లో రామ్ నటించాడు.. ఇక ఈ సినిమా తో నభా నటేష్ లాంటి హీరోయిన్ టాలెంట్ ఇండస్ట్రీ కి దొరికింది.. ఇదిలా ఉంటే రామ్ ప్రస్తుతం రెడ్ అనే సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే..

ద్విపాత్రాభినయం చేస్తున్న రామ్ ఈ సినిమా పై మంచి అంచనాలే పెట్టుకున్నాడు.. తనకు అచ్చొచ్చిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా పై అందరు మంచి అంచనాలే పెంచుకున్నారు.. వీరి కాంబో లో వస్తున్న మూడో సినిమా కాగ గత రెండు చిత్రాలు హిట్ అవడంతో ఈ చిత్రం తో హ్యాట్రిక్ హిట్ కొడదాం అనుకున్నారు.. కానీ కరోనా వల్ల ఈ సినిమా రిలీజ్ కి అడ్డు పడింది..ఇప్పటివరకు థియేటర్లు ఓపెన్ కాకపోవడంతో సినిమా కూడా రిలీజ్ కాకుండా పోయింది.. ఓ దశలో ఈ సినిమా OTT  లో రిలీజ్ చేయాలనీ చూశారు.. కానీ ఎందుకో కుదరలేదు..

దాంతో థియేటర్లు ఓపెన్ అయ్యే వరకు వేచి చూడాల్సి వచ్చింది..ఇక ఇప్పుడు థియేటర్లు ఓపెన్ అవడానికి పర్మిషన్ వచ్చేసింది..  దాంతో రామ్ రెడ్ సినిమా విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల చివరి వారంలో లేదా అంతకు ముందే థియేటర్లలో రెడ్ ను విడుదల చేయాలని భావిస్తున్నారు. కేంద్రం నుండి అనుమతులు వచ్చినా తెలుగు రాష్ట్రాల నుండి థియేటర్ల ఓపెన్ కు ఇంకా అనుమతులు రావాల్సి ఉంది. ఆ అనుమతులు కూడా వచ్చిన తర్వాత రెడ్ సినిమా విడుదల తేదీ విషయంలో స్పష్టత ఇవ్వనున్నారు. అయితే వచ్చిన రేటుకు రెడ్ సినిమా ను OTT లో అమ్ముకోవడం బెస్ట్.. థియేటర్లో రిలీజ్ చేస్తే సినిమా పై ఉన్న కొంత నెగెటివ్ ఎఫెక్ట్ కలెక్షన్ లపై పడి లాస్ వచ్చే ప్రమాదముందని సినీ విశ్లేషకులు అంటున్నారు.. ఈ నేపథ్యంలో రామ్ ఎలా ఆలోచిస్తాడో చూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -