Tuesday, April 23, 2024
- Advertisement -

అమావాస్య రోజు : మహిళలు పసుపుకొమ్ము ధరించాలా? నిజమెంత ?

- Advertisement -

నిన్న నుంచి సోషల్ మీడియాలో ఓ వార్త బాగా హల్ చల్ చేస్తోంది. దాంతో అది నిజామా కాదా అనేది తెలియకుండా అచారిస్తే సరిపోతుంది కదా అని అందరు ఫాలో అవుతున్నారు. విషయంలోకి వెళ్తే.. కరోనా పోవాలంటే అమావాస్య వరకూ మహిళలు అందరు పసుపు కొమ్ము కట్టుకోవాలంటూ చినజీయర్ స్వామి చెప్పారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునా బాగా ప్రచారం జరిగింది.

ఇది నిజమే అనుకుని ఇప్పటికే చాలా మంది మహిళలు పసుపు కొమ్ముని కట్టుకున్నారు. అయితే పసుపు కొమ్ము కట్టుకోవాలంటూ చినజీయర్ స్వామి చెప్పలేదని అందంతా అవాస్తవమని అహోబిళ స్వామి అన్నారు. కరోనా సోకకుండా ఉండాలంటే పసుపు కొమ్ము కట్టుకోవడం అనేది కరెక్ట్ కాదని.. కరోనా సోకకుండా ఉండాలంటే కేవలం సామాజిక దూరం పాటించడం ఒక్కటే మార్గమని ఆయన స్పష్టం చేశారు.

ముత్తయిదువులంతా తమ మంగళసూత్రాల మధ్య పసుపుకొమ్ము విధిగా కట్టుకోవాలంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన కోరారు. పసుపు కొమ్ములు కట్టుకోవాలంటూ చినజీయర్ స్వామి చెప్పారంటూ జరుగు ప్రచారం పూర్తిగా ఫేక్ అని ఆయన అన్నారు. కాబట్టి మహిళలు ఇలాంటివి చేయొద్దని.. కరోనా రాకుండా సామాజిక దూరం పాటించాలని.. ఎప్పటికికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని ఆయన తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -