Saturday, April 20, 2024
- Advertisement -

కొడుకు ని బాలకృష్ణ బలవంతం చేస్తున్నాడా?

- Advertisement -

నందమూరి మోక్షజ్ఞ.. నందమూరి తారక రామ రావు మనవడిగా, నందమూరి బాలకృష్ణ కుమారుడిగా అందరికి పరిచయమే. బాలకృష్ణ మొదటి నుంచి మోక్షజ్ఞ ని మీడియా కి దూరం గా తన కుటుంబానికి దూరం గా ఉంచి పెంచాడు అనే విషయం మన అందరికీ తెలిసిన విషయమే. అయితే అసలు మోక్షజ్ఞ ఎప్పుడు తెర మీద అరంగేట్రం చేస్తాడు అనే ఆసక్తి గత మూడు నాలుగు సంవత్సరాల నుండి అందరికీ ఉంది. అయితే ఈ విషయం మీద ఇప్పటికీ క్లారిటీ లేదు.

తాజా ఫిలిం నగర్ సమాచారం ప్రకారం మోక్షజ్ఞ కి అసలు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు అని తెలుస్తుంది. తన తండ్రి కోసం ఇటీవలే అమెరికా లో న్యూ యార్క్ లో ఫిలిం ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్స్ అయితే పూర్తి చేసాడు కానీ తాను మాత్రం వ్యాపారం లో అడుగు పెట్టాలని చూస్తున్నాడట. కానీ తండ్రి మాత్రం యాక్టర్ అయ్యి కుటుంబం లో మిగిలిన వారి వలె పెద్ద స్టార్ అవ్వాలని బలవంతం చేస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి.

అటు ఫామిలీ నుంచి కూడా మోక్షజ్ఞ బాగా ప్రెజర్ ఫీల్ అవుతున్నాడు అని వార్తలు వస్తున్నాయి కానీ అసలు చివరికి ఏం జరుగుతుంది అనేది మాత్రం అప్పుడే ఒక కొలిక్కి రాదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -