Tuesday, April 23, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ కి ఫిదాకి లింక్ ఏంటో తెలుసా..?

- Advertisement -

ఫిదా మూవీ.. అనుకోని రెంజ్ లో సూపర్ హిట్ కావడమే కాకుండా.. పెట్టిన బడ్జెట్ మించి కలెక్షన్స్ సాధిస్తోంది. ఇప్పటికి కలెక్షన్ల పరంగా ఈ సినిమాలో మంచి స్థాయిలో ఉంది. ముఖ్యంగా ఈ సినిమాని తెరకెక్కించిన దర్శకుడిని మెచ్చుకోవాలి. కథ మాములే అయిన.. కథనంతో అద్భుతం చేశారు.

వరుణ్ తేజ్, సాయి పల్లవి నటన ఈ సినిమాకి ఏంతో ప్లస్ అయింది. అయితే అసలు శేఖర్ కమ్ముల ఈ సినిమా కథను.. ముందుగా జనసేన పార్టీ నేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం రాసుకున్నట్లు తెలిపారు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా చిత్రం హిట్ అయిన నేపథ్యంలో, ఫిదా మూవీ కథను మహేష్ బాబుకు శేఖర్ కమ్ముల వినిపించాడట. కానీ ఆ కథను రాసుకున్నది మాత్రం మహేష్‌ను దృష్టిలో పెట్టుకొని కాదని.. కేవలం.. పవన్ కల్యాణ్‌ను దృష్టిలో పెట్టుకొని ఫిదా కథ రాసుకున్నట్లు శేఖర్ కమ్ముల తెలిపారు.

కథ రాసుకున్నప్పుడు వెనక నుంచి ఓ షాడోలా పవన్ కళ్యాణ్ తనను.. నడిపించారని.. శేకర్ కమ్ముల అన్నారు. ఆయన చేసిన ఖుషి సినిమా.. ఫిదా సెకండాఫ్ లో కనిపిస్తాయని తెలిపారు. అందుకే ఫిదా సినిమాను పవన్ కల్యాణ్‌తో తీద్దాం అనుకున్నానని శేఖర్ కమ్ముల అన్నారు. అయితే పవన్ తో సినిమా చేయకపోయినప్పటికి.. వరుణ్ మాత్రం ఫిదాలో అదిరిపోయే నటనతో అందరినీ ఆకర్శించాడని ప్రశంసించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -