Thursday, March 28, 2024
- Advertisement -

బిగ్ బాస్ ఇంట్లో.. అందాల ముద్దుగుమ్మలు వీరే..!

- Advertisement -

బిగ్ బాస్ సీజన్ 4 కి రంగం సిద్దం చేస్తుంది యాజమాన్యం. అయితే ఈ సీజన్ కి హోస్ట్ గా ఎవరు వ్యవహారిస్తారు అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈలోగా పార్టిసిపెంట్స్ జాబితాలోంచి కొన్ని పేర్లు లీక్ అవుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ వార్తా చానెల్ లో పని చేసిన బిత్తిరి సత్తిని బిగ్ బాస్ 4 కి ఖాయం చేశారని వార్తలు వస్తున్నాయి.

అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్ 4 లో రేణు దేశాయ్ కనిపిస్తోందని ప్రచారం జరిగింది. హోస్ట్ గా లేదా పార్టిసిపెంట్ గా కనిపిస్తారన్న గుసగుసలు అయితే వినిపించాయి. అయితే అందుకు సంబంధించిన సమాచారం ఏదీ లేదు. తాజాగా మరో నలుగురు ముద్దుగుమ్మల పేర్లు బయటకు వచ్చాయి. వీళ్లలో ముంబై హాట్ గాళ్ శ్రద్ధా దాస్.. తెలుగమ్మాయి యామిని భాస్కర్.. టాప్ మోడల్ కం నటి హంసా నందిని.. మరో తెలుగమ్మాయి ప్రియా వడ్లమాని.. మోనా అనే మరో నటి ఉన్నారని తెలుస్తోంది.

దాదాపు వంద రోజుల పాటు బిగ్ బాస్ హౌస్ ని అట్టుడికించేందుకు ఇలాంటి వేడెక్కించే కిలాడీ భామలు అవసరం అని స్టార్ మా వాళ్లు భావించారట. అందుకే ట్యాలెంటును జల్లెడ వేసి వెతికి మరీ పట్టుకున్నారు. ఇక బిగ్ బాస్ ఇంట్లో ప్రవేశించడం కోసం ఈ భామలు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారన్న గుసగుసలు కూడా వినిపించాయి. వీళ్లలో శ్రద్దా దాస్ ఇంతకు ముందు బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి కనిపించింది. ఇప్పుడు నేరుగా ఇంటి సభ్యురాలు అవుతోంది. సీన్ చూస్తుంటే.. తొలి మూడు సీజన్లను మించి ఈసారి గ్లామర్ కంటెంట్ ఎక్కువగానే ఉండేట్టు కనిపిస్తోంది.

‘బిగ్ బాస్ – 4’ హోస్ట్ గా సమంత ?

సుశాంత్ వీడియాలు చూసి ఎమోషన్ అయ్యాను.. : శ్రీరెడ్డి పోస్ట్

సుధీర్ అన్ని నాలుగు గోడల్ మధ్యలోనే చేస్తాడు.. సుధీర్ కి ప్రదీప్ పంచ్..!

లవ్ మ్యారేజ్ కావాలి.. నాలే అల్లరి చేయాలి : శ్రీముఖి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -