Thursday, April 25, 2024
- Advertisement -

తమన్ కాపీ పై క్లారిటీ వచ్చింది గా..!!

- Advertisement -

ఇటీవలే కాలంలో తమన్ మంచి సంగీతం అందిస్తుండగా ఆయనపై వి సినిమా పై కొన్ని కాపీ ఆరోపణలు ఇటీవలే రావడంతో దీనిపై ఇటీవలే ఈ చిత్ర దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ మాట్లాడారు. వీడియో కాల్ ద్వారా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇంద్రగంటి మోహన కృష్ణ మాట్లాడుతూ ” ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ఎన్నో విమర్శలు వచ్చాయి. చాలామంది రాట్ససన్ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని కాపీ కొట్టాం అని అన్నారు. రెండు సినిమాల బ్యాగ్రౌండ్ స్కోర్ ఒకే లాగా అనిపించి ఉండవచ్చు కానీ కాపీ కొట్టలేదు. అంటే రెండు సినిమాల బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేయడానికి ఒకే రకమైన ఇన్స్ట్రుమెంట్స్ వాడి ఉండొచ్చు. అందుకే రెండు సిమిలర్ గా అనిపిస్తాయి. వన్ నేనొక్కడినే సినిమా ఓపెనింగ్ టైటిల్ మ్యూజిక్ లో కొన్ని ఫ్రేసెస్ , ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొంచెం ఒకే లాగా ఉంటాయి. అలా ఉన్నంత మాత్రాన కాపీ కొట్టడం కాదు.

ఈ ఒక్క సినిమాకే కాదు ఇంతకు ముందు కూడా చాలా సినిమాలకి ఇలానే మ్యూజిక్ కాపీ కొట్టి నట్టు ఉంది అనే మాట విన్నాను. కానీ నిజంగా చూస్తే అక్కడ కాపీ కొట్టలేదు. సేమ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాడి ఉంటారు. మన తెలుగు వాళ్ళకి తమిళ్ వాళ్ళకి ఉన్నంత సంగీత పరిజ్ఞానం లేదు. మ్యూజిక్ క్రాఫ్ట్ పై అంత అవగాహన లేదు. అందుకే ఏదైనా సిమిలర్ గా అనిపించగానే కాపీ అనేస్తారు.

ఇంకొక విషయం ఏంటంటే తమన్ చాలా టాలెంట్ ఉన్న సంగీత దర్శకుడు. అతను వేరే సినిమాల మ్యూజిక్ అందులోనూ తమిళ్ లో అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సినిమా మ్యూజిక్ అసలు కాపీ కొట్టరు. ఎందుకంటే తమన్ కి తెలుసు. సోషల్ మీడియా వల్ల ఇలాంటివి ఐడెంటిఫై చేయడం కొన్ని నిమిషాల పని అయిపోయింది. కాపీ కొట్టకపోతేనే ఇంత గొడవ అవుతోంది, ఒకవేళ నిజంగానే కాపీ కొడితే ఎలా ఉంటుందో ఊహించండి. నేను చెప్పేది ఏంటంటే రెండు సిమిలర్ గా ఉన్నాయి కానీ కాపీ కాదు.” అని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -