నాగబాబు ఎందుకు సన్నబడ్డారు.. ?

1576
Getup Srinu About Nagababu
Getup Srinu About Nagababu

నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరంజీవి ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఎన్నో సినిమాల్లో నటించారు. కొన్ని సినిమాలను నిర్మించారు. జబర్దస్త్ షోకి జడ్జిగా కూడా ఉన్నారు. అయితే తాజాగా నాగబాబు గురించి కీలక విషయాలు బయటపెట్టాడు గెటప్ శ్రీను. నాగబాబు 41 రోజుల డైట్‌ను ఫాలో చేస్తున్నారని తెలిపాడు.

అందుకే అయన ఇంత తొందరగా సన్నబడ్డారని తెలిపాడు. జబర్దస్త్ ఆర్టీస్టులందరికి నాగబాబు అంటే అమితమైన ప్రేమ. ఆయన్ను ప్రత్యేకంగా గౌరవిస్తారు. జబర్దస్త్ కమెడీయన్ సుడిగాలి సుధీర్ అయితే నాగబాబుని డాడీ అని కూడా ప్రేమగా పిలుస్తారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగబాబు హెల్త్ సీక్రెట్స్ గురించి గెటప్ శ్రీను చెప్పుకొచ్చారు. 41 రోజుల డైట్‌ నాగబాబుగారు ఫాలో కావడం వల్లే సన్నబడ్డారని తెలిపాడు.

ఆ డైట్ ఆరోగ్యానికి చాలా మంచిదని.. దాని వల్ల భవిష్యత్తులో అనారోగ్యం బారిన పడకుండా ఉంటారని నాగబాబు చెప్పినట్లు గెటప్ శ్రీను చెప్పారు. ఈ డైట్ వల్ల తాను కూడా 5 కిలోలు తగ్గానని.. మిగతా ఆర్టిస్టులు కూడా ఆహార నియమావళి పాటిస్తున్నారని శ్రీను చెప్పారు. ఆరోగ్యం బాగుంటనే.. కెరీర్ కూడా బాగుంటుందని.. తద్వారా ఛాన్సులు వస్తాయని.. డబ్బు కూడా వస్తాయని.. నాగబాబు చెప్పేవారని గెటప్ శ్రీను చెప్పారు.

Loading...