Friday, April 19, 2024
- Advertisement -

సుడిగాలి సుధీర్ ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదంటే ?

- Advertisement -

జబర్దస్త్ షోలో సుడిగాలి సుధీర్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సుధీర్ టీంలో రాం ప్రసాద్, గెటప్ శ్రీను ఉంటారు. వీళ్లు చేసే కామెడీకి పగలపడి నవ్వాల్సిందే. నాగబాబు, రోజా కూడా వీరి కామెడీని తెగ ఎంజాయ్ చేస్తుంటారు. రాంప్రసాద్ తన ఆటో పంచులతో అదరగొడితే.. సుధీర్ ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొడుతుంటాడు. ఇక శ్రీను వెరైటీ గెటప్ లతో అందరినీ నవ్విస్తుంటారు. ఇక సుధీర్ పెళ్లీపై సోషల్ మీడియాలో ఇప్పటికే రకరకల వార్తలు వచ్చాయి.

రష్మీ, సుధీర్ లవ్ లో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి చెసుకోబోతున్నారని పుకార్లు వచ్చాయి. ఈ క్రమంలో సుడిగాలిస్ సుధీర్ గురించి అతడి ఫ్రెండ్ గెటప్ శ్రీను కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. సుధీర్ కు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని.. అతడి పెళ్లి విషయంలో తనకు కూడా కొన్ని ప్రపోజల్స్ వస్తున్నాయని చెప్పాడు. అయితే కొన్ని జాతకాలు సెట్ కావట్లేదన్న శ్రీను.. సుధీర్ కుటుంబ సభ్యులు మాత్రం పెళ్లి కోసం సీరియస్ గా ట్రై చేస్తున్నారని తెలిపాడు.

ఇక తన భార్య సుజాత, సుధీర్ చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. సుజాత బీటెక్ పూర్తయ్యాక.. జాబ్ కోసం హైదరబాద్ వచ్చినప్పుడు సుధీర్ తనకు పరిచయం చేశాడని తెలిపాడు. ఆ తర్వాత తమ మధ్య ప్రేమ చిగురించి పెళ్లి చేసుకున్నామని గెటప్ శ్రీను తెలిపాడు. అయితే సుధీర్ పెళ్లి చేసుకోకున్న తన తమ్ముడికి పెళ్లి చేశాడు. సుధీర్ పెళ్లి కాకపోవడానికి మరో కారణం కూడా సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

రష్మీకి కూడా పెళ్లి కాలేదు. ఇప్పుడు సుధీర్ పెళ్లి చేసుకుంటే వీరి మధ్య ఏం లేదని అందరికి అర్దం అవుతుంది. కొన్ని షోస్ వీరిద్దరు కెమెస్ట్రీ మీదా నడుస్తున్నాయి. సో ఎవరికి పెళ్లి జరిగిన ఆ షోస్ రెటింగ్ పడిపోతుందన్న కారణంతో సుధీర్ కావలనే పెళ్లిని దూరం పెడుతున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -