Wednesday, April 24, 2024
- Advertisement -

నాగబాబు మళ్లీ జబర్దస్త్ కి వస్తారు : గెటప్ శ్రీను

- Advertisement -

నాగబాబు జబర్దస్త్ షో నుండి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ‘జబర్దస్త్’ నుండి ‘అదిరింది’ షోకి జడ్జిగా వెళ్లిన నాగబాబు.. కామెడీ ఎవడబ్బ సొత్తు కాదు అంటూ సవాల్ చేశారు. రాజకీయాల్లోనే, బుల్లితెరపై ప్రస్తుతం నాగబాబుకి కలిసి రావడం లేదు. అదిరింది షోకి దారుణమైన రేటింగ్స్ వచ్చాయి. బార్క్ రేటింగ్స్‌లో జీ తెలుగు ప్రసారాల్లో టాప్ 30లో కూడా ‘అదిరింది’ కామెడీ షోకి స్థానం దక్కలేదు.

అదిరింది షో 3.30 రేటింగ్‌తో సరిపెట్టుకుంది. ఇక జబర్దస్త్ 7.26 రేటింగ్‌తో సత్తా చాటింది. ఇక కాన్సెప్ట్ పరంగానూ అదిరింది షో వీక్ గానే ఉంది. జబర్దస్త్ ను చూస్తున్నట్లే ఉండటం.. కొత్తదనం లేకపోవడం మైనస్ పాయింట్స్. అదిరింది షో దూకుడు కనిపించకపోవడంతో నాగబాబు మళ్లీ జబర్దస్త్‌కి తిరిగి వస్తారనే ప్రచారం గత కొన్నాళ్లుగా జరుగుతోంది. జబర్దస్త్ లో రోజా-నాగబాబు కాంబినేషన్‌ మంచి హిట్. ఈ సందర్భంగా గెటప్ శ్రీను షాకింగ్ కామెంట్స్ చేశాడు. గెటప్ శీను, సుడిగాలి సుధీర్, ఆటో రాం ప్రసాద్ హీరోలుగా నటిస్తున్న ‘3 మంకీస్’ మూవీ ట్రైలర్‌ను ఆదివారం రిలీజ్ అయింది. ఈ మూవీతో పాటు ‘డబ్ స్మాష్’ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు గెటప్ శీను.

ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న గెటప్ శీను ‘జబర్దస్త్’ కామెడీ షోని ఉద్దేశించి నాగబాబు రీ ఎంట్రీ త్వరలో ఉండబోతుందంటూ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం నాగబాబు గారు ‘అదిరింది’ షోకి జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే త్వరలో తప్పకుండా జబర్దస్త్‌కి తిరిగి వస్తారు. అదిరింది, జబర్దస్త్ వేరు వేరు ప్లాట్ ఫామ్స్ అయినా అందులో చేసేవాళ్లంతా ఒక కుటుంబంగానే ఉన్నాం. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. కాకపోతే నాగబాబు గారు జబర్దస్త్ షోకి తిరిగి వస్తే మాకు ఇంకా ఎనర్జీ పెరుగుతుంది అంటూ గెటప్ శీను చెప్పుకొచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -