Thursday, April 18, 2024
- Advertisement -

లింగమార్పిడి పాత్రలో నితిన్ హీరోయిన్..!

- Advertisement -

బాలీవుడ్ లో ప్రయోగాత్మక చిత్రాలు బానే వస్తాయి. అక్కడి జనం కూడా బానే అలరిస్తారు. అలా వీర్యదానం కాన్సెప్ట్ తో ‘విక్కీ డోనర్’మంచి హిట్ అయింది. ఇక తాజాగా లెస్బియన్ కథాంశంతో ‘ఏక్ లడకీకో దేఖాతో ఐసా లగా’ సినిమా విజయం సాధించింది. ఇప్పుడు ఏకంగా లింగమార్పిడి కథాంశంతోనే ఒక మూవీ తెరకెక్కుతోంది.

ఆ సినిమానే ‘మ్యాన్ టు మ్యాన్’. ఈ మూవీలో ‘హార్ట్ ఎటాక్’ సినిమాలో నటించిన ఆదా శర్మ నటిస్తోంది. 2008లోనే ‘1920’ సినిమాతో ఆదా శర్మ పరిచయం అయింది. దాదాపుగా దశాబ్దం పైనే సినీరంగంలో రాణిస్తున్న ఈ భామ.. హిందీ.. తెలుగు.. కన్నడ.. తమిళ భాషల్లో నటిస్తోంది. అయితే ‘మ్యాన్ టు మ్యాన్’ చిత్రంతో తన కెరీర్ లోనే మొదటిసారి ఛాలెంజింగ్ రోల్ చేస్తోంది. ఆదాశర్మ ఈ సినిమాపై హోప్స్ బానే పెట్టుకుంది. ఈ సినిమాలో పుట్టుకతో అబ్బాయి అయిన ఆదా శర్మ పాత్ర.. లింగమార్పిడి ఆపరేషన్ ద్వారా అమ్మాయిగా మారుతుందట. అయితే ఈ విషయం తెలియని హీరో హీరో నవీన్ కస్తూరియా అదాను పెళ్ళి చేసుకుంటాడట.

పెళ్లి తర్వాత ఆమె గురించి తెలుగుకున్న హీరో షాక్ అవుతాడట. లింగమార్పిడి పై మన సమాజంలో ఉన్న చిన్నచూపు.. అలాంటి శస్త్రచికిత్స ద్వారా మారిన వ్యక్తులు ఎదుర్కొనే ఇబ్బందులను ఎంటర్టెయినింగ్గా చూపిస్తూ ఒక సోషల్ మెసేజ్ ఇస్తూ దర్శకుడు అబీర్ సేన్ గుప్తా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడట. తాజాగా ఆదాశర్మ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. “1920” నా మొదటి సినిమా. ఈ సినిమాలో నా పాత్ర చేయడం రిస్క్ అనిపించింది. నాకు రిస్క్ తీసుకోవడం ఇష్టం. ‘కమాండో 2’ లో కూడా రిస్క్ ఉన్న పాత్రే చేశాను. అదే పాత్రను ‘కమాండో 3’లో కంటిన్యూ చేశారు. ఇక ప్రస్తుతం చేస్తున్న మ్యాన్ టు మ్యాన్ కూడా రిస్క్ తో కూడుకున్న గొప్ప పాత్ర” అంటూ ఆదాశర్మ చెప్పుకొచ్చింది.

కడుపు చేయించుకుంది.. అంటూ పూనమ్ పై ఫైర్ అయిన శ్రీరెడ్డి..!

కుష్బూని ఇప్పుడు చూస్తే ఎవరైన షాక్ కావాల్సిందే..!

జగన్ తో భేటీకి రానని చెప్పిన బాలయ్య.. కారణం ఇదే..!

45 ఏళ్ళ నగ్మా పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఇదే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -