బిగ్ బాస్ ఫైనల్స్ కు హేమ నో.. ఎందుకు ?

327
Hema is not coming to the Bigg Boss Finals
Hema is not coming to the Bigg Boss Finals

ప్రస్తుతం తెలుగు రియాలిటీ షోలో నంబర్ వన్ షోగా దూసుకెళ్తోంది బిగ్ బాస్ షో. గత రెండు సీజన్లకు ఏ రెంజ్ లో క్రేజ్ వచ్చిందో ఇప్పుడు ఈ సీజన్ కు కూడా అదే స్థాయిలో క్రేజ్ తో పాటు రేటింగ్ కూడా వచ్చింది. బిగ్ బాస్ అంటేనే వివాదాలకు దగ్గర ఉంటుంది. గత రెండు సీజన్లో కూడా వివాదాలు చాలానే జరిగాయి. అయితే ఈ మూడో సీజన్ లో అంతకు మించిన వివాదాలు అయ్యాయి.

అయినప్పటికి బిగ్ బాస్ షో సక్సె ఫుల్ గా చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్ షో చివరి వారంలో ఉంది. హౌస్ లో మొత్తం ఐదుగురు కంటెస్టెంట్లు.. శ్రీముఖి, రాహుల్, అలీ, వరుణ్. బాబా బాస్కర్ లు ఫైనల్ బరిలో ఉన్నారు. అయితే ఈ ఐదుగురిలో ఈ సీజన్ విజేత ఎవరు అవుతారు అనేది పెద్ద చర్చానీయాంశంగా మారింది. అయితే ఫైనల్ ఎపిసోడ్ కోసం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ ను పిలవడం గత సీజన్ల నుంచి ఆనవాయితీగా వస్తుంది. అదే ప్రకారం ఇప్పుడు ఈ సీజన్ కోసం బిగ్ బాస్ నిర్వాహకులు హేమను సంప్రదించారట.

అయితే ఇప్పటికే బిగ్ బాస్ లో జరిగిన అవమానాలు చాలావా.. ఇక ఫైనల్ కు మాత్రం రానని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే నిర్వాహకులు కండీషన్స్ ప్రకారం కచ్చితంగా కంటెస్టెంట్స్ ఫైనల్స్ కి రావాల్సి ఉంటుంది. ఇక హిమజ, తమన్నా వంటి వారు కూడా బిగ్ బాస్ షోపై ఫైర్ గా ఉన్నారు. వారు కూడా ఫైనల్స్ కు వచ్చేలా కనిపించడం లేదు. ఈ క్రమంలో వీళ్లు ఫైనల్స్ కు వస్తారా లేదా అనేది ప్రశ్నగా మారింది. ఒకవేళ రాకుంటే ఫైనల్స్ ను వాయిదా వేసే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Loading...