Friday, April 19, 2024
- Advertisement -

నన్ను ఆ కేసులో ఇరికించింది అతనే : సుమన్

- Advertisement -

సుమన్.. ఒకప్పడు మంచి హీరో. తమిళ సినిమాల ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. బాను చందర్ సాయంతో టాలీవుడ్లో అడుగు పెట్టాడు. అప్పట్లో సుమన్ కాల్షీట్ల కోసం దర్శకులు, నిర్మాతలు ఎదురుచూసేవారట. ఫ్యామిలీ, మాస్ ఆడియన్స్ లో ఇతనికి మంచి క్రేజ్ ఉండేది. అలాంటీ ఈ హీరోని బ్లూ ఫిలిమ్స్ కేసులో ఇరికించి.. గుండా యాక్ట్ కూడా మోపి జైలుకి పంపించారు.

’టాలీవుడ్ లో ఓ స్టార్ హీరో.. అతని ఎదుగుదలకు సుమన్ అడ్డు వస్తున్నాడని.. సుమన్ పై తప్పుడు కేసులు బనాయించి జైలుకి పంపేలా చేశాడని’ ఎప్పటి నుండో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల సుమన్ పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆయనకు ఈ విషయం గురించి ఓ ప్రశ్న ఎదురైంది. దీని గురించి సుమన్ మాట్లాడుతూ.. “నన్ను బ్లూ ఫిలిమ్స్ కేసులో ఇరికించిన వ్యక్తి పేరు దివాకర్. అతను ఇండస్ట్రీతో సంబంధం ఉన్న వ్యక్తి కాదు. అతని సమస్య .. ప్రైవేట్‌ ఫ్యామిలీ ఎఫైర్‌ కు సంబంధించింది. ఈ వివాదంలోకి సినిమా వాళ్ళను అనవసరంగా లాగారు. నేను జైలు వెళ్తానన్న విషయం నాకు ముందే తెలుసు.

అందుకే నా ఫ్రెండ్ భాను చందర్‌ను కాపాడేందుకు ప్రయత్నించాను. ‘నన్ను కలవద్దు, నాకు ఫోన్ చెయ్యొద్దు’ అని భాను చందర్‌తో కావాలనే చెప్పాను. నేను తెలుగులో బాగా క్లిక్‌ అవుతానని నమ్మిన వ్యక్తి భానునే..! నా వల్ల అతను ఇబ్బందులు పడకూడాదనే ఉద్దేశంతో అలా చెప్పాను. ఆ రోజు జరిగిన దానికి పూర్తి కారణం అప్పటి నా మిత్రుడు దివాకరే. అతని గురించి నేను ఎప్పుడో చెప్పాను. కానీ అనవసరంగా కొంతమంది హీరోల పేర్లు తెర మీదకు వచ్చాయి. ఆ రోజు జరిగినదానికి.. ఏ హీరోతోనూ సంబంధం లేదు” అంటూ అసలు విషయం చెప్పాడు సుమన్.

రష్మి‌ హగ్ నన్ను హగ్ చేసుకుంది.. అడ్డంగా బుక్ చేసిన సుధీర్..!

హీరోయిన్ తో ప్రేమలో ఉన్న హీరో ఆది పినిశెట్టి.. ఎవరామె ?

హైపర్ ఆదిని టార్గెట్ చేసిన సద్దాం.. ఊహించని పంచ్..!

నయనతార ప్రమోషన్స్ కి దూరంగా ఉండటానికి కారణం ఇదే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -