Thursday, April 25, 2024
- Advertisement -

వెంకీ కూతురు వ్యాపారం మొదలు పెట్టింది.. బిస్కెట్స్ అమ్ముడుపోతాయా..?

- Advertisement -

సినిమా నటులు.. నటన తప్పిస్తే వేరేవి చేయలేరు అని ఒక్కప్పుడు అనేవారు.. కానీ ఇప్పుడు సినిమా నటులే బోలెడన్ని వ్యాపారాలు చేస్తున్నారు. టాప్ పొజిషన్ లో ఉన్నవారు.. దాన్ని ఉపయోగించుకుని వ్యాపారాలు మొదలు పెట్టి ప్రమోషన్స్ కూడా చేసుకుంటున్నారు.

ఇప్పటికే రకరకల వ్యాపారాల్లో సినీ నటులు నిమగ్నం కాగా.. ఇప్పుడు ఓ సీనియర్ హీరో కూతురు తన అదృష్టం పరిక్షించుకోనుంది. వెంకటేష్ పెద్ద కూతురు అశ్రితకు కలినరీ ఆర్ట్స్ అంటే మహా ఇష్టం. ఈ విషయంలో కొన్ని ప్రొఫెషనల్ కోర్సులను కూడా ఈమె పూర్తి చేసేసింది. ఇప్పుడు తన ఆసక్తి.. ఇష్టం.. అభిరుచిలను బేస్ చేసుకుని వ్యాపారం ప్రారంభించేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. బిస్కెట్స్ తయారీలో వెంకీ కూతురు నిమగ్నం కానుంది. ఇలా కుకీస్ వ్యాపారంతో తన కెరీర్ ఫిక్స్ చేసుకోవాలని ఓ హీరో డాటర్ ఫిక్స్ కావడం ఆసక్తి కలిగించే విషయమే.

ఇప్పటికే ఈమె తయారు చేసిన కుకీస్ ను.. రామానాయుడు స్టూడియోస్ లో స్టాల్స్ ద్వారా విక్రయిస్తున్నారు. ఆసక్తి కలవారు ఈ స్టాల్స్ లో కుకీస్ కొనుగోల్ చేయవచ్చు. త్వరలోనే రిటైల్ ఔట్ లెట్స్ ద్వారా తన బిస్కెట్లను విక్రయించనుందిట అశ్రిత. అంతేకాకుండా.. తండ్రి సహకారంతో భారీ స్థాయిలో ఈ వ్యాపారంను విస్తరించేందుకు ప్రణాళికలు కూడా సిద్దం చేసుకుందట. ఇందుకు వెంకీ కూడా పూర్తిగా సపోర్ట్ చేయబోతున్నాడని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -