నా పని అయిపోయిందని అవమానించారు : అంజలి

625
heroine anjali shares her critical situations in industry
heroine anjali shares her critical situations in industry

టాలీవుడ్ లోకి తెలుగమ్మాయిగా మంచి ఫాలోయింగ్ సంపాధించుకుంది అంజలి. అయితే ఈ అమ్మడుకి తెలుగులో కంటే తమిళంలో అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. అక్కడ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తర్వాత తెలుగు దర్శకులు కూడా ఈ భామకి అవకాశాలు ఇవ్వడం మొదలెట్టారు.అయితే నార్త్ హీరోయిన్స్ తరహాలో తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఈ అమ్మడికి గుర్తింపు రాలేదు. హిట్స్ వచ్చిన కూడా అంజలిని తెలుగు దర్శక నిర్మాతలు పెద్దగా పట్టించుకోలేదు.

అదే సమయంలో తమిళంలో కూడా కొంత కాలం అవకాశాలు తగ్గాయి. ఇలాంటి పరిస్థితిలో తనకి ఎదురైనా అనుభవాల గురించి అంజలి ఒక ఇంటర్వ్యూలో తాజాగా చెప్పుకొచ్చింది. కెరియర్ పరంగా ఎత్తుపల్లాలు ఉండటం సహజం. అవకాశాల కోసం నేను ఎప్పుడూ అంతగా ఎదురుచూడలేదు. రాలేదని బాధపడలేదు. కానీ ఆ మధ్య మా కుటుంబంలో జరిగిన గొడవలు ఎక్కువగా వైరల్ అయ్యాయి. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలిసిపోయాయి ఆ సమస్యల కారణంగా నేను బాధపడుతున్నప్పుడు నన్ను ఓదార్చినవారు చాలా తక్కువమంది.

నాకు సన్నిహితులుగా వున్నవారే నా గురించి హేళనగా మాట్లాడటం, బాధించడం చేశారు.ఇక నాపని అయిపోయింది అంటూ వాళ్ళు అన్న మాటలు నన్ను చాలా బాధపెట్టాయి.అయిన కూడా మళ్ళీ నన్ను నేను మెరుగు పరుచుకొని అవకాశాలు అందిపుచ్చుకున్న అని చెప్పింది.హీరోయిన్స్ గా ఒక అమ్మాయి ఎదిగిందంటే ఆమె పక్కకి చేరి ప్రేమలు కురిపించేవారు. కెరియర్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కనికరం లేకుండా వదిలేసి పోతారు.ఇలాంటి అనుభవాలు ప్రతి హీరోయిన్ జీవితంలో కచ్చితంగా జరుగుతాయని అంజలి చెప్పింది.

Loading...