Thursday, April 25, 2024
- Advertisement -

హీరోయిన్ మెహ్రిన్‌కు కారు ప్ర‌మాదం..!

- Advertisement -

హీరోయిన్ మెహ్రిన్‌కు కారు ప్ర‌మాదం జ‌రిగినట్లుగా తెలుస్తుంది.అయితే ఇది నిజంగా జ‌రిగిన సంఘ‌ట‌న కాదులేండి.పూర్తి వివారాల్లోకి వెళ్తే…మెహ్రిన్ ప్ర‌స్తుతం రెండు సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉంది.ఆమె ప్ర‌స్తుతం అనీల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ‘ఎఫ్2’ సినిమాలో వ‌ర‌ణ్ తేజ్ స‌ర‌స‌న హీరోయిన్‌గా చేస్తుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. అర్ధరాత్రి హీరోయిన్ ని కారు ఢీ కొట్టే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ విషయంపై స్పందించిన మెహ్రీన్ ‘యాక్షన్ సీన్స్ లో నటించడం ఇదే మొదటిసారి. కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి నేను ఆలస్యం చేయను’ అని తెలిపింది. ఇక ఈ సినిమాలో త‌మ‌న్నా కూడా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.సీనియ‌ర్ హీరో వెంక‌టేశ్ -వరుణ్ తేజ్ క‌లిసి ఈ మూవీలో న‌టిస్తున్నారు.మెహ్రిన్ ఈ సినిమాతో పాటు దిల్ బ్యాన‌ర్‌లో మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో మ‌రో మూవీలో న‌టిస్తుంది మెహ్రిన్‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -