Friday, April 19, 2024
- Advertisement -

అదిరింది షోపై హైపర్ ఆది కామెంట్స్..!

- Advertisement -

హైపర్ ఆది కి జబర్దస్త్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన స్కిట్ వస్తుందటే టీవీల ముందు వాలిపోతారు. జబర్దస్త్ లోకి మాములు అర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఆది.. అభి టీంలో ఒక మెంబర్ గా చేశేవాడు. ఆదిలో ఉన్న టాలెంట్ ను గుర్తించిన జబర్దస్త్ టీం అతనికి టీం లీడర్ గా అవకాశం ఇచ్చారు.

ఇచ్చిన అవకాశంను సరిగ్గా ఉపయోగించుకున్న ఆది.. కొన్ని నెలలోనే జబర్దస్త్ లో మెయిన్ టీం లీడర్ గా ఎదిగాడు. ఆ తర్వాత అతని కోసమే జబర్దస్త్ చూసేలా క్రేజ్ సంపాధించుకున్నాడు. అతను చేసిన స్కిట్స్ కి యూట్యూబ్ లో మిలియన్స్ లో వ్యూవ్స్ ఉన్నాయి. ఇక జబర్దస్త్ చేస్తూనే ఇతర షోస్ చేస్తూ.. సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ఇక జబర్దస్త్ కు పోటీగా జీతెలుగులో అదిరింది షో వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ షోలోకి నాగబాబు జడ్జిగా వెళ్ళారు. జబర్దస్త్ అంతకాకున్న ఇప్పుడిప్పుడే ఈ షో పుంజుకుంటుంది.

ముఖ్యంగా ఈ అదిరింది షోలో గల్లి బాయ్స్ చేసే స్కిట్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. వారి స్కిట్స్ కి యూట్యూబ్ లో కూడా ట్రెండింగ్ అవుతున్నాయి. అయితే ఇటీవలే అదిరింది షోలో గల్లి బాయ్స్ స్కిట్స్ ట్రెండింగ్ అవ్వడంతో పాటు మిలియన్స్ వ్యూవ్స్ వస్తున్నాయి. దీని అందుకోవడంలో హైపర్ ఆది వెనకబడ్డాడు అని హైపర్ ఆదిని ఓ ఇంటర్వ్యూలో అడగగా.. ఆది షాకింగ్ కామెంట్స్ చేశాడు. నా స్కిట్స్ ఎంత పెద్ద హిటో అందరికి తెలిసిందే. నా స్కిట్స్ 10 మిలియన్స్ నుంది 50మిలియన్స్ వ్యూవస్ వరకు వెళ్లాయి.

ఈ అదిరింది షో నన్ను ఇంకా దాటలేదు. అంత మాత్రనా తనని తక్కువ చేయొద్దని ఆది అన్నాడు. ఐదు వారాల పాటు హడావుడి చేయడం కాదు.. ఐదు సంవత్సరాలు మెయింటైన్ చేయడం అనేది ముఖ్యం. నేను ఐదు సంవత్సరాల నుంచి మెయిన్టైన్ చేస్తున్నాను. గల్లి బాయ్స్ కి వచ్చే వ్యూవ్స్.. నేను స్టార్టింగ్ లో చేసే స్కిట్స్ కి వచ్చేవి. హైపర్ ఆదిని దాటాలంటే ఎన్నో స్కిట్స్ చేయాలి. నా రికార్డులను దాటడం ఎవరి వల్ల కాదని ఆది అన్నాడు. ఏది ఏమైన ఆది స్కూట్స్ లో ఓ మజా ఉంటుందని చెప్పొవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -