పాపం.. నాగబాబుపై హైపర్ సెటైర్స్.. అవసరమా ?

1288
hyper aadi comments on nagababu in jabardasth
hyper aadi comments on nagababu in jabardasth

జబర్దస్త్ కు సంబంధించిన అంశాలు గత కొద్ది రోజులుగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. నాగబాబు ఈ షో నుంచి తప్పుకోవడంతో రకరకల వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నాగబాబు భజన చేసినోళ్లే ఇప్పుడు ఆయనపై కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే.. జబర్దస్త్ నుంచి నాగబాబు తప్పుకోవడానికి కారణం కేవలం రెమ్యూనరేషన్ మాత్రమే కారణం అని అనుకున్నారు.

కానీ ఇతర కారణాలు కూడా ఉన్నాయని ఇటీవలే నాగబాబు చెప్పారు. అయితే తాజాగా జరిగిన ఎపిసోడ్ లో నాగబాబు లేకున్నా ఆయనపై పంచులేయడం హాట్ టాపిక్ అయింది. గతంలో జడ్జ్ స్థానంలో నాగబాబు కూర్చున్నప్పుడు ఆయను పొగుడుతూనే పంచులు వేసిన వాళ్లు ఇప్పుడు సెటైర్స్ వేస్తున్నారు. ఓ స్కిట్‌లో భాగంగా మాజీ జడ్జి నాగబాబుపై అదిరిపోయే పంచ్ వేశాడు హైపర్ ఆది. తన స్కిట్‌లో భాగంగా తోటి కంటెస్టెంట్స్‌లతో డైలాగ్స్ చెప్పించి మరి నాగబాబుపై సెటైర్స్ వేయడం ఆసక్తి రేపింది.

”అరేయ్ మనం ఎప్పుడు ఇలాగే కలసి ఉండాలిరా అంటే.. వెంటనే హైపర్ ఆది ఏడేళ్లుగా కలసిన వారు విడిపోతున్నారు మూడేళ్లది.. బొక్క మన రిలేషన్ ఎంత” అంటూ పంచ్ వేశాడు హైపర్ ఆది. ఇక చలాకి చంటి కూడా నాగబాబుపై పంచ్ వేశాడు. . ‘ఇక్కడ వేరే రాజు ఉండాలి కదా’ అంటూ ఒక కంటెస్టెంట్ అడిగితే ఆయనకు ‘ఇక్కడ భోజన వసతులు బాగోలేవని వేరే రాజ్యానికి వెళ్ళిపోయాడు.. వెళుతూ వెళుతూ మాకు ఈ రాజ్యాన్ని ఇచ్చి వెళ్ళాడు’ అంటూ సెటైర్ వేశారు. నాగబాబుపై సెటైర్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Loading...