Saturday, April 20, 2024
- Advertisement -

అవకాశాలు లేక ఇలియానా ఏం చేస్తుందో తెలుసా ?

- Advertisement -

‘దేవదాస్’ చిత్రంతో టాలీవుడ్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది గోవా బ్యూటీ ఇలియానా. ఆ తర్వాత అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దక్షిణాదిలో కోటి రూపాలయ పారితోషికం తీసుకున్న మొదటి హీరోయిన్ గా ఇలియానా గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్లో అగ్ర నటులందరి సరనన నటించింది.

ఆ తర్వాత బాలీవుడ్ లో ఛాన్సులు రావడంతో.. అక్కడ కూడా మంచి నటిగా గుర్తింపు పొందింది. అయితే ఇటీవలి కాలంలో సినీ అవకాశాలు తగ్గిపోయాయి. తెలుగులో అమర్ అక్భర్ ఆంటోని చిత్రంలో నటించన ఇక్కడ కూడా చాన్సులు మళ్లీ రావడం లేదు. అయితే ఇప్పుడు తన కెరీర్ డీలా పడిపోయింది. అందుకే కొత్త కెరీర్ ను ప్రారంభిచేందుకు ఇల్లీ రెడీ అవుతోంది. యాంకర్ గా మారేందుకు ఇలియానా యత్నిస్తోంది. యాంకర్ అంటే బుల్లితెర షోలలో యాంకర్ కాదు.

స్పోర్ట్ ఛానల్ లో యాంకర్ గా మారేందుకు సన్నాహకాలు చేస్తోంది. ఇప్పటికే ఓ స్పోర్ట్స్ ఛానల్ యాజమాన్యంతో చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. సదరు యజమాన్యం కూడా ఇల్లీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. మరి యాంకర్ గా ఇలియానా ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -