ఛాన్స్ లు లేక ఇలియానా ఏం చేస్తుందంటే ?

759
Ileana Turns As News Anchor
Ileana Turns As News Anchor

హీరోయిన్ గా అవకాశం దక్కించుకుని కొంతకాలం స్టార్ హీరోయిన్ గా ఉండి తర్వాత అవకాశాలు తగ్గిపోవడం అనేది సినీ పరిశ్రమలో మాములే. హీరోయిన్ కెరీర్ చాలా తక్కువ టైం. తర్వాత హీరోయిన్ గా కాకుండా క్యారెక్టర్ పాత్రలు చేసుకోవాల్సిందే. లేకుంటే సీరియల్స్.. టీవీ కార్యక్రమాలకు హోస్టుగానో జడ్జిగానో వ్యవహరించాలి.

ఈ బాటలో ఇప్పటికే ఎంతో మంది నడిచారు. కొందరైతే హీరోయిన్ గా కొనసాగుతూనే టీవీ కార్యక్రమాలలో పాల్గొంటారు. తాజాగా గోవా బ్యూటీ కూడా ఇలా బుల్లితెరపై మెరిసేందుకు సిద్దం అయింది. ఇలియానాకు అఫర్స్ రావడం లేదు. టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటికి పెద్దగా సక్సెస్ కాలేదు. తిరిగి ముంబైలో ఆఫర్స్ కోసం ట్రై చేస్తోంది. ప్రస్తుతం అజయ్ దేవగణ్ నిర్మిస్తున్న ‘ది బిగ్ బుల్’ అనే సినిమా ఒక్కటే ఇల్లీ బేబీ చేతిలో ఉంది. ఈ సినిమాలో హీరో అభిషేక్ బచ్చన్.

ఇదిలా ఉంటే రీసెంట్ గా ఒక నేషనల్ న్యూస్ ఛానెల్ ఇలియనాకు ఒక క్రేజీ ఆఫర్ ఇవ్వడంతో న్యూస్ యాంకర్ అవతారమెత్తేందుకు రెడీ అయిందట. ఇది రెగ్యులర్ న్యూస్ యాంకర్ల తరహాలో బ్రేకింగ్ న్యూసులను అదేపనిగా తిప్పి తిప్పి చెప్పే వ్యవహారం అయి ఉండదని… ఏదైనా స్పెషల్ షో ప్లాన్ చేసి ఉంటారని అంటున్నారు. ఇలియానాకు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపే ఉంది కాబట్టి షో కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉంటే క్లిక్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి ఇలియానాతో ఎలాంటి షో చేస్తారో చూడాలి.

Loading...