మహేష్ – పరశురామ్ సినిమా స్టోరీ లీక్..!

522
interesting gossip on mahesh babu parasuram film story
interesting gossip on mahesh babu parasuram film story

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మళ్లీ షూటింగ్ లో బిజీ కాబోతున్నాడు. లాక్ డౌన్ కారణంగా 27వ సినిమా ఆలస్యంగా అయింది. వీలైనంత తొందరగా షూట్ కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు. 27వ సినిమాను పరశురామ్ డైరెక్షన్ చేయబోతున్నాడు. అయితే ఈ సినిమా కథ గురించి కొన్ని కథనాలు వెలువడుతున్నాయి.

భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నికేవ్వరు సినిమాలతో విజయాలను అందుకుంటూ సేఫ్ జోన్ లో వెళ్తున్నాడు మహేష్. సరిలేరు నీకెవ్వరు తర్వాత వంశీ పైడిపల్లితో సినిమా చేయాలనికున్నాడు మహేష్. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోవడంతో పరుశురామ్ లైన్ లోకి వచ్చాడు. లాక్ డౌన్ అనంతరం సినిమా మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సర్కారు వారి పాట అనే ఒక టైటిల్ సెట్ చేసినట్లు టాక్ వస్తోంది. మహేష్ చేసిన సినిమాల్లో ఇంతవరకు ఏ సినిమాకు ఇలాంటి టైటిల్ సెట్ చేయలేదు. కానీ సినిమా కథకు కరెక్ట్ గా సెట్టవుతుందని దర్శకుడు చెప్పగానే మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఎండింగ్ లో ఉన్నాయి.

ఇక పోతే ఈ సినిమా అసలు స్టోరీ ఇదేనంటూ సొషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బ్యాంకింగ్ వవస్థలోని లొసుగులను వాడుకుని వేలకోట్లు స్వాహా చేసే మోసగాళ్ళను అడ్డుకునే వ్యక్తిగా మహేష్ బాబు పాత్రను డిజైన్ చేశారట. ప్రస్తుతం మన దేశంలో ఉన్న ట్రెండింగ్ టాపిక్స్ లో ఇదీ ఒకటి కాబట్టి ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది భావిస్తున్నారట. మరోసారి మహేష్ సేఫ్ జోన్ లోనే వెళుతున్నట్లు అర్ధమవుతోంది. మరి ఆ కాన్సెప్ట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Loading...