Saturday, April 20, 2024
- Advertisement -

హీరోయిన్ తో ప్రేమలో ఉన్న హీరో ఆది పినిశెట్టి.. ఎవరామె ?

- Advertisement -

సీనియర్ దర్శకుడు రవిరాజ పినిశెట్టి గురించి అందరికి తెలిసిందే. గతంలో ఆయన తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తీశారు. ఆయన కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు ఆది పినిశెట్టి. ఇతను కూడా తన నటనతో ఎంతో మంచి క్రేజ్ ను తెచ్చుకున్నాడు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు విలన్ గా ’సరైనోడు’ ‘అజ్ఞాతవాసి’ వంటి సినిమాలో చేశాడు.

అలానే సహాయనటుడుగా ‘నిన్ను కోరి’ ‘రంగస్థలం’ వంటి సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రీటిలపై రూమర్స్ రావడం అనేది మాములే. కానీ ఆదిపై ఇప్పటివరకు రూమర్ రాలేదు. అయితే ఇప్పుడు ఆది ఓ హీరోయిన్ తో లవ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు నిక్కి గల్రాని. ‘బుజ్జిగాడు’ సినిమాలో ప్రభాస్ మరదలిగా నటించిన సంజనా గల్రాని చెల్లెలే ఈ నిక్కీ గల్రాని. ఆది హీరోగా చేసిన ’మలుపు’ మరియు ’మరకతమణి’ సినిమాల్లో ఈమె హీరోయిన్ గా చేసింది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈమె సుపరిచితమే.

సునీల్ హీరోగా నటించిన ‘కృష్ణాష్టమి’ చిత్రంలో ఈమె హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే.. జూలై 14న ఆది తండ్రి రవిరాజా పినిశెట్టి పుట్టినరోజు కావడంతో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ వేడుక జరిగింది. ఈ వేడుకలో హీరోయిన్ నిక్కీ కూడా కనిపించింది. దాంతో ‘ఆది, నిక్కీ ప్రేమలో ఉన్నారు..త్వరలో పెళ్లిచేసుకోబోతున్నారు’ అంటూ ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే ఆది కానీ నిక్కీ కాని స్పందించాల్సిందే.

బిగ్ బాస్ 4లో వర్మ ’నగ్నం బ్యూటీ’.. ?

నా పెళ్లి గురించి మీకెందుకు.. : రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్

ప్రభాస్ ’రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ పై విపరీతమైన ట్రోల్స్..!

అనసూయ తొక్కేస్తున్న రష్మీ.. క్రేజ్ మాములుగా లేదు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -