Thursday, March 28, 2024
- Advertisement -

యాంకర్ ప్రదీప్ కు యాక్సిడెంట్ అయిందా ?

- Advertisement -

బుల్లితెరపై యాంకర్ ప్రదీప్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయన మేల్ యాంకర్స్ లో టాప్ లో ఉన్నాడు. అతన్ని బుల్లితెర సూపర్ స్టార్ అని అతని ప్యాన్స్ పిలుస్తుంటారు. ఆ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న ప్రదీప్ పెళ్లి గురించి కూడా సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అయితే తాజా ప్రదీప్ అసలు కనిపించడం లేదు.

అసలు ప్రదీప్ కు ఏమైంది అనే విషయంపై క్లారిటీ లేదు. కొన్ని రోజుల క్రితం యాంకర్ రవి స్పందిస్తూ.. త్వరలోనే ప్రదీప్ మనముందుకు వస్తారని అన్నారు. కానీ ఎప్పుడో చెప్పలేదు. అతను ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నట్లు చేప్పాడు. ఇక సోషల్ మీడియాలో ప్రదీప్ గురించి ఎవరికీ తోచినట్లు వాళ్ళు అనుకుంటున్నారు.

తాజాగా అసలు ప్రదీప్‌కు ఏమైంది అంటూ చర్చించుకుంటున్న సమయంలో సోషల్‌ మీడియాలో ఒక వార్త హల్‌ చల్‌ చేస్తోంది. ప్రదీప్ అనారోగ్యం కారణంగా బ్రేక్ తీసుకోలేదని.. అతడు యాక్సిడెంట్ కు గురికావడం వల్ల గాయాలు కావడంతో బ్రేక్ తీసుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త విని అతని ప్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. మరి యాక్సిడెంట్ అవుతే ప్రదీప్‌ కాని మరెవ్వరైనా కాని సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకుంటారు కదా.

అందుకే యాక్సిడెంట్ వార్తలు నిజం కాదని కొందరు అంటున్నారు. ఆ వార్తలు నిజం కావవద్దని ప్రదీప్ ప్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ప్రదీప్ కు అసలు ఈమైంది ? ప్రస్తుతం ఈ విషయం చాలా పెద్ద మిస్ట్రరీగా మారింది. సోషల్ మీడియాలో వేర్‌ ఈజ్‌ ద ప్రదీప్‌ అంటూ ఒక హ్యాష్‌ ట్యాగ్‌ బాగా వైరల్ అవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -