రాహుల్ సిప్లిగంజ్ కు పెళ్లైందా ?

672
is rahul sipligunj got married singer noel wishes goes viral
is rahul sipligunj got married singer noel wishes goes viral

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు పెళ్లి అయిందా ? ఎవరికి తెలియకుండా చేసుకున్నాడా ? అసలే సోషల్ మీడియాలో రాహుల్, పునర్నవి మధ్య ఏదో ఉందని వార్తలు వస్తున్న క్రమంలో సడెన్ గా రాహుల్ పెళ్లి న్యూస్ వైరల్ కావడం ఏంటి ? రాహుల్ కి బాగా సన్నిహితంగా ఉండే సింగర్ నోయల్ శుభాకాంక్షలు చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది.

విషయంలోకి వెళ్తే.. బిగ్‌బాస్ మూడో సీజన్‌లో పునర్నవి, రాహుల్ కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంది. వీరిద్దరి పెళ్లి గురించి లెక్కలేనన్ని వార్తలు వచ్చేవి. రాహుల్‌ ఎవరిని ఇష్టపడ్డా ఆమెతోనే వివాహం జరిపిస్తామని తమకెలాంటి అభ్యంతరం లేదని ఆయన తల్లిదండ్రులు కూడా చెప్పుకొచ్చారు. అయితే రాహుల్-పునర్నవిలు కేవలం మంచి స్నేహితులమేనని ఎన్నోసార్లు స్పష్టం చేశారు. తాజాగా రాహుల్ ఇంట్లో అంతా కలిసి సందడి చేసినట్టు కనిపిస్తోంది. సింగర్ నోయెల్, వరుణ్, వితికా, ఇంకో ఇద్దరు స్నేహితులు రాహుల్ ఇంట్లో సందడి వాతావరణాన్నితీసుకొచ్చారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి.

ఈ ఫోటోకు నోయెల్ చేసిన కామెంటే ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షించింది. అందరితో సరదాగా ఉన్న ఫోటోను షేర్ చేసిన రాహుల్.. హ్యాపీ టైమ్స్.. విత్ హ్యాపీ పీప్స్ అంటూ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌కు సింగర్ నోయెల్ స్పందిస్తూ.. హ్యాపీ మ్యారిడ్ లైఫ్.. నీ పట్ల ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ కామెంట్ క్షణాల్లో వైరల్ అయింది. దాంతో రాహుల్ పెళ్లైందా ? అని అందరికి డౌట్ వచ్చింది ? ఎవరా లక్కి గర్ల్ అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరి కొంత మంది రాహుల్ ను ఆట పట్టించడం కోసమే నోయల్ ఇలా చేసి ఉంటాడని కామెంట్స్ పెడుతున్నారు. మరి రాహుల్ ఏం అంటాడో చూడాలి.

తాజాగా అంతా ఒకేచోట...
Loading...