Saturday, April 20, 2024
- Advertisement -

బిగ్‌బాస్ 3హోష్ట్‌గా క్రేజీ హీరో అర్జున్ రెడ్డి…?

- Advertisement -

బిగ్‌బాస్‌ సీజన్‌-2 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్‌ గొడవలతో సోషల్‌ మీడియాలో ఓ ట్రెండ్‌ సృష్టించింది ఈ రియాల్టీ షో. ఆసక్తికర టాస్క్‌లు, సెలబ్రిటీల సడన్‌ ఎంట్రీలతో బిగ్‌బాస్ 2 ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. దీనికి హోస్ట్‌గా నాని వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

తెలుగులో బిగ్‌బాస్ రియాలిటీ షోకు బుల్లితెర ప్రేక్షకుల్లో అనూహ్యమైన స్పందన వస్తున్నది. మొదటి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించి ఈ షోను మరోస్థాయికి తీసుకెళ్లాడు. షూటింగ్‌ల బిజీ కారణంగా ఎన్టీఆర్ రెండో సీజన్‌కు దూరం కావడంతో ఆ బాధ్యతను నేచురల్ స్టార్ నాని భుజాన ఎత్తుకొని స‌క్సెస్ ఫుల్‌గా న‌డిపిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి భారీగా స్పందన రావడంతో టెలివిజన్ రేటింగ్స్ కూడా అమాంతం పెరిగిపోయాయి. , మొద‌ట బిగ్‌బాస్ 2కి హోస్ట్‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను అడిగారంట‌. బిగ్‌బాస్‌ హోస్ట్‌గా ఆఫర్ బిగ్‌బాస్ హోస్ట్‌గా చేయమని విజయ్ దేవరకొండతో స్టార్ మా నిర్వాహకులు చర్చలు జరిపారట. ఆ సమయంలో గీత గోవిందం, టాక్సీవాలా షూటింగ్ దశలో ఉండటంతో ఆఫర్‌ను విజయ్ నిరాకరించారట. కానీ మూడో సీజన్ చేయడానికి ఒప్పుకొన్నట్టు ఓ వార్త సోషియ‌ల్ మీడియాలో ప్రచారంలో ఉంది.

బిగ్‌బాస్ మూడో సీజన్‌కు విజయ్ దేవరకొండ హోస్ట్‌గా వస్తే ఆ రియాలిటీ షోకు మరింత క్రేజ్ ఏర్పడే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని సినీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఒకవేళ ఈ వార్త నిజమైతే విజయ్ దేవరకొండ ప్రతీ ఇంటి సభ్యుడికి బుల్లితెర ద్వారా చేరువయ్యే అవకాశం లేకపోలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -