Thursday, April 25, 2024
- Advertisement -

జబర్దస్త్ లో లేడీ గెటప్ లో నటించేది వీళ్లను రియల్ గా చుశారా ?

- Advertisement -

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ నేడు వెండితెర మీద రాణిస్తున్న విషయం మనకు తెలిసిందే. దీని ద్వారా ఎంతోమంది నూతన నటీనటులు ఇప్పుడు వెండితెరకు పరిచయమయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో మగవాళ్ళు అయివుండి లేడీ గెటప్స్ వేసుకుని అందులో కామెడీ చేస్తూ నవ్వించడం అంటే మామూలు విషయం కాదు. వీరు నిజంగా ఆడవాళ్ళు కానప్పటికీ లేడీ గెటప్స్ తో మంచి మేకప్ తో తమదైన శైలిలో నటిస్తూ తెగ నవ్విస్తున్నారు. ఈ రోజు వాళ్ల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఇక ముందుగా శాంతి స్వరూప్ గురించి మాట్లాడుకోవాలి. హైపర్ ఆది, చమ్మక్ చంద్ర టీమ్ లో తనదైన శైలిలో నటించి లేడీ గెటప్ లో మనందరిని ఎంతగానో నవ్విస్తున్న ప్రముఖ నటుడు శాంతి స్వరూప్. జబర్దస్త్ లో దాదాపు 400పై స్కిట్స్ లో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. నిజంగా జబర్దస్త్ కార్యక్రమానికి రాకముందు శాంతి స్వరూప్ నానా కష్టాలు పడ్డారు ఒక అవకాశం ఇవ్వండి స్టూడియోల చుట్టూ తిరిగారు. అలా జబర్దస్త్ షో ఇతని లైఫ్ ను పూర్తిగా మార్చేసింది.

పైగా అతను ఆడవాళ్ళుగా కనిపించడంలో ఎటువంటి ఇబ్బంది లేదని ఇది నా జీవితాన్ని నిలబెట్టిన ఈ కార్యక్రమం కాబట్టి నేను ఆడవాళ్లుగా కనిపించడంలో ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంతో రుణపడి ఉన్నానని అన్నారు. ఆ తర్వాత లేడీ గెటప్ తో మనల్ని అందర్నీ ఆశ్చర్యపరిచిన మరో ప్రముఖ నటుడు తన్మాయ్. నిజంగా లేడీ గెటప్ లో అమ్మాయా అన్నంతగా మనల్ని మరింత గా మాయ చేసిన నటుడు తన్మాయ్.

ఎంతో గ్లామర్స్ గా కనిపిస్తూ అచ్చం అమ్మాయిలా ఈ కార్యక్రమానికి యాంకర్స్ గా రాణిస్తున్న రష్మీ, అనసూయలకు పోటీగా అందంతో కనిపిస్తాడు తన్మాయ్. నిజంగా తన్మాయ్ అబ్బాయి అంటే ఎవరు నమ్మరు. అందరూ అమ్మాయే అని అనుకుంటారు. అంత అందంగా ఎంతో గ్లామరస్గా జబర్దస్త్ కామెడీ షో లో కనిపిస్తూ ఉంటారు. నిజంగా ఈ కార్యక్రమం ద్వారా ఇతనికి వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.

లేడీ గెటప్ లో ఇతని అసలు ఎవరు గుర్తుపట్టలేరు. పైగా అబ్బాయి కంటే అమ్మాయి గానే బాగా సరిపోయాడు. అదే కోవలో రాబోతున్న ఇంకో నటుడు మోహన్. రాకేట్ రాఘవకు సరిపోయే జోడీగా భార్య పాత్రలో నటిస్తూ మనందర్ని ఎంతగానో నవ్విస్తున్న నటుడు మోహన్. చూడటానికి అచ్చం అమ్మాయిలా కనిపించే మోహన్ రియల్ లైఫ్ లో ఎలా ఉంటాడో చూసి ఆశ్చర్య పోవాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -