జబర్దస్త్ చిన్నపిల్లలు ఎంత సంపాధిస్తున్నారంటే ?

2117
jabardasth nihant and deevena and naresh remuneration
jabardasth nihant and deevena and naresh remuneration

జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడీయన్స్ గా మారారు. పెద్దలనే కాదు పిల్లలను కూడా ఈ షో బాగా ప్రొత్సహిస్తోంది. ఇప్పటికి టాప్ రేటింగ్ తో ఈ షో దూసుకెళ్తోంది. కొందురు ఈ షో చేసి కార్లు, బిల్డింగ్ లు కొన్నారు. ఇక లేడీ గెటప్ లు వేసే వారు కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఈ షో ద్వారా చిన్నపిల్లలు యోధ, నిహాంత్, దీవెన, నరేష్‌ వంటి బుడతలు బాగా పాపులర్ అయ్యారు.

నిహాంత్ తన మాటలు, హావభాబాలతో నవ్విస్తాడు. యోధ పంచ్‌లతో సందడి చేస్తే.. ఇక దీవెన ఏకంగా యాంకర్ రష్మీపైనే సెటైర్లు వేస్తోంది. రాకింగ్ రాకేష్ టీంలో వీరందరు ఉన్నారు. రాకేష్ కు ఇంత పేరు రావడానికి కారణం ఈ పిల్లలే. కేవలం చిన్న పిల్లలతోనే స్కిట్ నడిపి నవ్వులు పూయిస్తున్నాడు రాకేష్. ప్రస్తుతం రాకేష్ టీంలో నిహాంత్, నరేష్, నెమలి రాజు, దీవెన ఉన్నారు. పిల్లలంటే బట్టి పట్టి డైలాగులు చెప్పడం కాకుండా పెద్దలకు ధీటుగా చాలా నాచురల్ గా క్యారెక్టర్లో జీవిస్తూ డైలాగ్స్ చేబుతారు.

జబర్దస్త్ ద్వారా బాగా పాపులర్ అయిన ఈ పిల్లలు.. సినిమాల్లో కూడా నటిస్తున్నారు. రాకేష్ టీంలో వీరు చేసినందుకు రాకేష్ దాదాపు ఒక ఎపిసోడ్ కు ఒక్కొక్కరికి పదివేల చొప్పున ఇస్తున్నాడని తెలుస్తోంది. అయితే ఇందులో ఉండే నరేష్ అన్ని స్కిట్లలో కనిపిస్తాడు కాబట్టి అతను ఎక్కువగా సంపాధిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైన ఈ చిన్నపిల్లల స్కిట్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

Loading...